ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్సీ

ABN, First Publish Date - 2021-08-03T06:40:36+05:30

వైసీ పీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

కళ్యాణదుర్గంలో ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణదుర్గం/రాయదుర్గం రూరల్‌/ఉరవకొండ, ఆగస్టు 2: వైసీ పీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సోమవారం కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం యూటీఎఫ్‌ నాయకులు జే నాగరాజు క్యాంపు కా ర్యాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులతో సుదీర్ఘంగా సమీక్షించారు. సీఎం జగన ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్కహామీ కూడా నెరవేర్చలేదని విమర్శించా రు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జయచంద్రారెడ్డి, నాగేంద్ర, లింగమయ్య, జిల్లా నాయకులు జె నాగరాజు, ఈశ్వరయ్య, రాజేంద్ర, చిత్తప్ప, అబ్దుల్‌వహాబ్‌, సాయిరామ్‌, మజ్జిగ నాగరాజు పాల్గొన్నారు.  అదేవిధంగా వ్యవసాయశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉ ద్యోగులకు మార్చి నెల నుంచి వేతనాలు అందలేదని ఎంపీఈఓలు ఎమ్మె ల్సీ దృష్టికి తీసుకుపోయారు. ఆసంఘం నాయకులు నాగరాజు, అశోక్‌, ని ర్మల, క్రిష్ణవేణి, రాజు ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. 


‘విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం’ 

విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు అన్నారు. రాయదుర్గం ఎన్జీవో భవనంలో పీడీఎఫ్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లు గడిచినా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వై ఖరి ఏమిటో తెలియజెప్పాల్సిన అవసరం వుందన్నారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను పీడీఎఫ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యుటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జయశంకర్‌, ఉపాధ్యక్షులు గోవిందరాజులు, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, హనుమంతరెడ్డి, రామేశ్వరరెడ్డి, వెంకట్రామిరెడ్డి, రవికాంత, రవినాయక్‌, గౌరమ్మ పాల్గొన్నారు. అదేవిధంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై శాసనమండలిలో ప్రస్తావించాలని సీఐటీ యూ జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున ఎమ్మెల్సీని కోరారు. కార్యక్రమంలో సీపీఎం  నాయకులు నాగరాజు, మధు, తిమ్మరాజు, శంకర్‌, రమేష్‌, మల్లికార్జున, శంకర్‌, రాము, తిప్పేస్వామి పాల్గొన్నారు. 


‘శాసనమండలిలో గళం విప్పుతా’

ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యా సమస్యలపై శాసనమండలిలో గళం విప్పి  సమస్యల పరిష్కారానికి తనవంతుగా పోరాడతానని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా హ క్కు చట్టానికి వ్యతిరేకంగా జీవోను విడుదల చేయడం సరికాదన్నారు. సీపీఎ్‌సను రద్దు చేస్తామని చెప్పి, మాట తప్పారన్నారు. కార్యక్రమంలో నాయ కులు సుధాకర్‌, జయచంద్రరెడ్డి, రామప్ప, రాజశేఖర్‌, ధనుంజయ, అశోక్‌కుమార్‌, రాజేష్‌, క్రిష్టప్ప పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-03T06:40:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising