ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

ABN, First Publish Date - 2021-10-29T05:37:42+05:30

సచివాలయ ఉద్యోగులు విధుల్లో బాధ్యతరహితంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జేసీ నిషాంత్‌ కుమార్‌

ధర్మవరంరూరల్‌, అక్టోబరు 28: సచివాలయ ఉద్యోగులు విధుల్లో బాధ్యతరహితంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌ హెచ్చరించారు. గురువారం పట్టణంలోని తిక్కస్వామినగర్‌, సంజయ్‌నగర్‌, శివానగర్‌లోని 5వ, 7వ, 8వ వార్డు సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయా సచివాయాల్లోని రిజిస్టర్లను, ప్రభుత్వం ద్వారా అందు తున్న సేవలపై ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 7వ వార్డులోని సచివాలయ ఆడ్మిన్‌సెక్రటరీ సురేష్‌నాయక్‌ను ఆర్జీ విచారణ, రికార్డు తయారుచేయి విధానంపై ప్రశ్నించారు. ఆడ్మిన్‌ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఇతనిపై చర్యలకు నివేదికలు పంపాలని ఆర్డీఓను ఆదేశించారు. అదేవిధంగా శివానగర్‌లోని 5వ వార్డు మహిళ పోలీస్‌ వినూత్నను మహిళ పోలీస్‌విధులు, సెక్షన్‌ 354, 326, 324ల గురించి అడగ్గా అమె నుంచి సరైన సమాఽధానం రాకపోవడంతో ఈమెపై చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు.  విధుల్లో ఎవరైన నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు.  అదేవిధంగా సచివాలయంలో సిబ్బందికి ఆర్జీల విచారణ, నివేదికలు తయారు విధా నంపై ప్రతిరోజు ఆర్డీఓ, మున్సిపల్‌ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయాల్లో సా యంత్రం 5గంటల నుండి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ వరప్రసాద్‌రావు, తహసీల్దార్‌ నీలకంఠారెడ్డి, మున్సిపల్‌సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-29T05:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising