ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజ్‌ చేసిన డాక్యుమెంట్లతో నకిలీ రిజిస్ర్టేషన

ABN, First Publish Date - 2021-07-10T06:00:08+05:30

-స్టాంపు వెండర్‌పై చర్యలకు డీఐజీ సిఫార్సు

2012 నాటి డాక్యుమెంట్లతో అగ్రిమెంట్‌ చేసుకున్న నకిలీ పత్రాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శింగనమల, జూలై9 : రిజిస్ర్టేషన శాఖలో నకిలీ రిజిస్ర్టేషన పత్రం వ్యవహా రం ఇటీవల వెలుగులోకి వచ్చింది. 2012 నాటి రిజిస్ర్టేషన పత్రాలను ఇప్పుడు వి క్రయించి తప్పుడు అగ్రిమెంట్‌ను సృష్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. దీనిపై చర్యలకు రిజిస్ర్టేషన శాఖ డీఐజీ సిఫార్సు చేశారు. దీంతో నకి లీ రిజిస్ర్టేషన పత్రాల వ్యవహారం మరో మారు చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఆ శాఖకు చెందిన కొందరు అధికారుల పాత్రపైనా ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. వివరా ల్లోకి వెళ్తే... శింగనమల మండలం పెరవలి రెవెన్యూ గ్రామం పరిధిలోని 428-1 సర్వే నెంబరులోని 5.18 ఎకరాల భూమి భాగ ప రిష్కారాలకు గతేడాది నవంబరు 22వ తేదీన ఎస్‌ చిన్నప్పరెడ్డి కుటుంబ స భ్యులకు దాఖలైంది. ఆ రోజు రిజిస్ర్టేషన వారి పేరిట జరిగింది. అనంతరం న వంబరు 30వ తేదీన వారి నుంచి కొనుగోలు చేయడానికి తరిమెల రాజమో హనరెడ్డి అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నాడు. ఈ ఏడాది మే ఆఖరు నాటికి కొనుగోలు చేసేట్లు ఆ అగ్రిమెంట్‌ జరిగింది. అయితే ఈ మధ్య లో అదే భూమి కొనుగోలుకు గత యేడాది అక్టోబరు 10వ తేదీన జ్వాల బాల నరసింహారెడ్డితో మరో అగ్రిమెంట్‌ అయింది. ఆయనకు 2021, మార్చి 23వ తేదీ తేదీన రిజిస్ర్టేషన కూడా చేయించారు. విషయం తెలిసిన రాజమోహనరెడ్డి దీనిపై సందేహం కలిగి... భాగ పరిష్కారానికి ముందే జరిగిన అగ్రిమెంట్‌ వివరాలను సేకరించారు. అక్టోబరు 10న అగ్రిమెంట్‌ జరిగిన డాక్యుమెంట్‌ నెంబరు ఏఎన 545740, ఏఎన545752 పత్రాలు ఎప్పుడు జారీ అయ్యాయని ఆర్టీఐ ద్వారా రిజి స్ర్టేషన శాఖను కోరారు. దీనిపై స్పందించిన రిజిస్ర్టేషన శాఖ అధికా రులు ఈ పత్రాలు 2020 సంవత్సరంలో జారీ చేయలేదని జవాబిచ్చారు. అంతేకాకుండా ఆ పత్రాలను 2012వ సంవత్సరంలో ఖాదర్‌బాషా అనే స్టాంపు వెండర్‌కు జారీ చేసినట్లు తెలిపారు. ఆయన లైసెన్సును 2015లోనే రద్దు చేసినట్లు కూడా ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు అధికారులు సమాధానమిచ్చారు. అయితే ఇప్పు డు డాక్యుమెంట్లను స్టాంపు వెండరుగా ఉన్న ఖాదర్‌బాషా భార్య హమీదా బేగం నుంచి కొనుగోలు చేసి యాంటిడేట్‌తో అగిమ్రెంట్‌ చేసుకున్నట్లు తేలింది. ఇదిలా ఉంటే స్టాంపు వెండర్‌ ఖాదర్‌బాషాపై గతంలో ఆరోపణలు రావడంతో పాటు విచారణలో అవి తేలడంపై 2015లోనే ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన వద్ద నున్న సీజ్‌ చేశారు. ఆ డాక్యుమెంట్లు ఇప్పుడు ఎలా బయటికొచ్చాయన్న సందేహాలు సర్వత్రా నెల కొన్నాయి.

డీఐజీకి ఫిర్యాదు...

ముందుగా అగ్రిమెంటు కుదుర్చుకున్న రాజమోహన రెడ్డి ఈ అంశంపై రిజిస్ర్టేషన శాఖ డీఐజీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీఐజీ ప్రాథమి క విచారణ చేపట్టారు. అనంతరం ఇవి నకలీ డాక్యుమెంట్లుగా గుర్తించి ఇప్పుడు చర్యలకు సిఫార్సు చేస్తూ జిల్లా రిజిస్ర్టార్‌కు ఆదేశాలిచ్చారు. నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. అయితే అధికారులపై ఎటువంటి చర్యలుంటాయన్నది వేచి చూడాల్సిందే.


Updated Date - 2021-07-10T06:00:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising