ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.7.43 లక్షల నగదు స్వాధీనం

ABN, First Publish Date - 2021-01-16T06:29:41+05:30

ఎలాంటి బిల్లులూ లే కుం డా ఒక వాహనం లో తరలిస్తున్న రూ. 7.43 లక్షల ను స్వాధీనం చే సుకున్నట్లు డీ ఎ స్పీ చైతన్య గురువారం మీడియా కు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడిపత్రి, జనవరి 15: ఎలాంటి బిల్లులూ లే కుం డా ఒక వాహనం లో తరలిస్తున్న రూ. 7.43 లక్షల ను స్వాధీనం చే సుకున్నట్లు డీ ఎ స్పీ చైతన్య గురువారం మీడియా కు తెలిపారు. పట్టణంలోని శివాలయం సర్కిల్‌ వద్ద పట్టణ సీఐ తేజ మూర్తి, ఎస్‌ఐ ప్రదీ్‌పకుమార్‌ తమ సిబ్బందితో బళ్లారి నుంచి వస్తున్న ఒక కారులో ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నగదును, కారును కోర్టుకు అప్పగించామన్నారు. బళ్లారి నుంచి ఒక బొలెరో, ఒక కారులో తరలిస్తున్న రూ.77,195 విలువైన గుట్కా ప్యాకెట్లు, 19 బీరు బాటిళ్లు, ఒక మద్యం ఫుల్‌బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆ వాహనాలనూ సీజ్‌ చేసి.. తిరుపతికి చెందిన నాగసుబ్బారెడ్డి, నెల్లూరుకు చెందిన వినోద్‌కుమార్‌, కమలాపురానికి షాహెల్‌పై కేసు నమోదు చేశామన్నారు. రూ. లక్ష విలువ చేసే సుమారు వంద కిలోల కాపర్‌వైర్‌ను అక్రమంగా రెండు బైక్‌ల్లో తరలిస్తున్న పుట్లూరు మండలం అరకటవేములకు చెందిన డీ రాజకుళ్లాయప్ప, పెద్దిరాజు, జగదీ్‌షలను  సజ్జలదిన్నె వద్ద రూరల్‌ ఎస్‌ఐ ఖాజాహుస్సేన్‌ అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న రాజకుళ్లాయప్ప కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.   మం డలంలోని చుక్కలూరు క్రాస్‌ వద్ద రెండు బైక్‌లోఆరు లీటర్ల నాటుసారాను తరలిస్తున్న కొత్తరాముడు, నాగేంద్ర, మహే్‌షలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద ఉన్న రూ.2500లను స్వాధీనం చేసుకొని, బైక్‌లను సీజ్‌ చేశామన్నారు. ఈ  సమావేశంలో సీఐ తేజమూర్తి, ఎస్‌ఐలు ప్రదీప్‌, ఖాజాహుస్సేన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T06:29:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising