ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశ్వత్థం క్షేత్రంలో అవినీతిపై అంతు తేలుస్తా : మున్సిపల్‌ చైర్మన

ABN, First Publish Date - 2021-06-23T06:24:16+05:30

పెద్దపప్పూరు మండలంలోని ప్రసిద్ధక్షేత్రమైన శ్రీఅశ్వత్థంలో జరిగిన అవినీతిపై అంతు తేలుస్తామని టీడీపీ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడిపత్రి, జూన 22: పెద్దపప్పూరు మండలంలోని ప్రసిద్ధక్షేత్రమైన శ్రీఅశ్వత్థంలో జరిగిన అవినీతిపై అంతు తేలుస్తామని టీడీపీ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.  హైదరాబాద్‌లో ఉన్న ఆయన మంగళవారం ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. తమ హయాంలో అశ్వత్థం క్షేత్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాక ఆర్థిక పరిస్థితిని పరిపుష్టి చేశామన్నారు. అప్పట్లో క్షేత్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధిచేసి దాదాపు రూ.2.5 కోట్ల ఆదాయాన్ని డిపాజిట్‌ రూపంలో ఉంచామన్నారు. రెండేళ్లకాలంలో ఏ మేరకు ఆదాయం వచ్చిందో దేవదాయశాఖ తెలపాలన్నారు. ఈ కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. తనకు అందిన సమాచారం మేరకు పెద్దఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఇందుకు ఈఓ బాధ్యుడన్నా రు. హైదరాబాద్‌ నుంచి తాడిపత్రికి వచ్చిన వెంటనే అశ్వత్థక్షేత్రంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. పెద్దపప్పూరు మండలంలోని తిమ్మనచెరువు వద్ద ఉన్న వజ్రగిరి లక్ష్మినరసింహస్వామి దేవాలయం తమ హయాంలో అభివృద్ధి చేశామన్నారు. ప్రతి ఏడాది ఉత్సవాల కోసం లక్షలాది రూపాయలను ఖర్చుచేసేవారమని తెలిపారు. దేవాలయం ఆదాయం అధికంగా ఉందని, రెండేళ్లుగా హుండీ తెరవలేదని రూ.లక్షల్లో డబ్బులు ఉంటాయని ఆగమేఘాలపై దేవాలయాన్ని ఎండోమెంట్‌లోకి చేర్చి బలవంతంగా హుండీని తెరిచి డబ్బులు లెక్కించారని ఆరోపించారు. వారి అంచనాలు తలకిందులై హుండీలో కేవలం రూ.4లక్షలలోపే డబ్బు ఉందన్నారు. తిమ్మనచెరువు వద్ద తన తల్లిపేరుమీద కల్యాణమండపం ఏర్పాటు చేశామని, వచ్చిన ఆదాయాన్ని ఉత్సవాలకు ఖర్చు చేస్తున్నామని, వృద్ధాశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-06-23T06:24:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising