ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డీపీఆర్‌ఓ కార్యాలయాన్ని తరలించకండి’

ABN, First Publish Date - 2021-07-08T06:13:50+05:30

పెనుకొండ, ధర్మవరం పట్టణాల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న డివిజనల్‌ పౌరసంబంధాల కార్యాలయాన్ని ఎత్తివేసి అనంతపురం డీపీఆర్‌ఓ కార్యాలయంలో విలీనం చేయడానికి కమిషనర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారని పెనుకొండలోని ఈ కార్యాలయాన్ని తరలిచండంవల్ల విలేకరులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, ఈ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించరాదని పాత్రికేయులు మంత్రి శంకర్‌నారాయణకు, సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుకొండ, జూలై 7: పెనుకొండ, ధర్మవరం పట్టణాల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న డివిజనల్‌ పౌరసంబంధాల కార్యాలయాన్ని ఎత్తివేసి అనంతపురం డీపీఆర్‌ఓ కార్యాలయంలో విలీనం చేయడానికి కమిషనర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారని పెనుకొండలోని ఈ కార్యాలయాన్ని తరలిచండంవల్ల విలేకరులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, ఈ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించరాదని పాత్రికేయులు మంత్రి శంకర్‌నారాయణకు, సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. బుధవారం పాత్రికేయులు సంఘం నాయకులు రవూఫ్‌, రామకృష్ణ, ప్రకాశగౌడ్‌, ఆదినారాయణ, ప్రసాద్‌, మల్లికార్జున, నవీన, ఎలక్ర్టానిక్‌ మీడియాప్రతినిధులు వినతిని అందిస్తూ డివిజనల్‌ పీఆర్‌ఓ కార్యాలయం ఇక్కడే ఉండటంవల్ల పట్టణంలో వీఐపీల పర్యటన వివరాలను కార్యాలయం సిబ్బంది ఎప్పటికప్పుడు తెలియజేసేవారన్నారు. కార్యాలయం ఇక్కడి నుంచి తరలిస్తే పాత్రికేయులకు సమాచారం అందక ఇబ్బందులు పడతారన్నారు. పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే శంకర్‌నారాయణ, ఆర్‌అండ్‌బి మంత్రిగా ప్రాతినిత్యం వహిస్తున్న నియోజకవర్గంకాబట్టి ఇక్కడ తప్పనిసరిగా డివిజనల్‌ పీఆర్‌ కార్యాలయాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.



Updated Date - 2021-07-08T06:13:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising