ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

ABN, First Publish Date - 2021-06-21T06:40:18+05:30

రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందేమిలేదని, కేంద్రపథకాలను తమ ఖాతాలో వేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని బీజేపీ రాష్ట్రనాయకులు, మాజీ ఎమ్మెల్యే గోనుగుం ట్లసూర్యనారాయణ విమర్శించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల

ధర్మవరం, జూన 20: రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందేమిలేదని, కేంద్రపథకాలను తమ ఖాతాలో వేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని బీజేపీ రాష్ట్రనాయకులు, మాజీ ఎమ్మెల్యే గోనుగుం ట్లసూర్యనారాయణ విమర్శించారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. కరోనా వ్యాధిని కట్టడిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘో రంగా విఫలం చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్నిరా ష్ట్రాలకు కరునా మెడిసినలు, వెంటిలేటర్లు, వ్యాక్సిన అందిస్తోందన్నారు.  అ యితే రాష్ట్రప్రభుత్వం కరోనా సమయంలో ప్రజలకు కనీస సదుపా యాలు కల్పించడంలో వైఫల్యం చెందిందన్నారు. ప్రత్యేకించి  నియో జకవర్గంలో దాదాపు 2500 మంది కరోనా వ్యాధితో మరణించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  కరోనా వ్యాధిగ్రస్థులకు బెడ్లు, ఆక్సిజనకూడా అందక తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారన్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ఒక్క డోసు వ్యాక్సినేషన కూడా అందించలేదన్నారు. అ లాంటిది వ్యాక్సిన కోసం గ్లోబల్‌ టెండర్లను నిర్వహిస్తే ఒక్కరూ కూ డా పాల్గొనకపోవడం బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్కపనితీరు అర్థమవుతుందన్నారు. మరో వైపు మున్సిపాలిటీ ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రజలపై పన్నుల రూపంలో భారాన్ని మోపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. కరోనా వ్యాధితో మరణించిన ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థికసాయాన్ని అందించడంతోపాటు రైతులు, చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీ అందించా లని డిమాండ్‌ చేశారు. కనీసం ఇసుకను కూడా అందించలేని దీన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమ యంలో మద్యపాన నిఽషేధాన్ని అమలుచేస్తామని హామీ ఇచ్చిన  జగన  అధికారంలోకి రాగానే  మద్యాన్ని ఆదాయవనరుగా మా ర్చు కుని ప్రజల రక్తాన్నీ పీల్చి పిప్పి చేస్తున్నాడని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో  బీజేపీ నాయకులు పామిశెట్టి శివశంకర్‌, సుదర్శన రెడ్డి, డిష్‌రాజు, అరవిందరెడ్డి, దుస్సాక్రిష్ణ, రాప్తాటిరాము, గొట్లూరు చంద్ర తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-21T06:40:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising