ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టాలు తప్పిన గూడ్స్‌ వ్యాగన

ABN, First Publish Date - 2021-10-16T05:30:00+05:30

రాయదుర్గం వైపు నుంచి బళ్లారికి వెళ్తున్న ఖాళీ గూడ్స్‌ రైలు వ్యాగన పట్టణ సమీపాన శుక్రవారం మధ్యాహ్నం పట్టాలు తప్పింది.

ఊడిపోయిన గూడ్స్‌ చక్రాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయదుర్గం, అక్టోబరు 16: రాయదుర్గం వైపు నుంచి బళ్లారికి వెళ్తున్న ఖాళీ గూడ్స్‌ రైలు వ్యాగన పట్టణ సమీపాన శుక్రవారం మధ్యాహ్నం పట్టాలు తప్పింది. దీంతో అటువైపు రైళ్ల రాకపోకలు మూడున్నర గంటలపాటు స్తంభించిపోయాయి. చిక్కజాజుర్‌ నుంచి రాయదుర్గం మీదుగా జిందాల్‌కు వెళ్తున్న ఖాళీ గూడ్స్‌ రై లు హుబ్లీ డివిజనలోని 52/45 కిలోమీటర్‌ వద్ద పట్టాలు తప్పింది. సరిచేసేందుకు రైల్వే అధికారులు తీవ్రం గా శ్రమించారు. హొస్పేట్‌ నుంచి రా యదుర్గం మీదుగా బెంగళూరు వెళ్లే రైలు మూడున్నర గంటలు ఆలస్యం గా నడిచింది. రైలు వ్యాగన పట్టాలు తప్పడంతో ఆటువైపుగా రావాల్సిన రైళ్లన్నీ నిలిపి వేశారు. బళ్లారి వైపు నుంచి వచ్చే వ్యాగన్లు, రైళ్లను ఓబుళాపురం రైల్వేస్టేషనలో, చెళ్లకెర నుం చి వచ్చే గూడ్స్‌లను మొలకాల్మూరు రైల్వే స్టేషనలో నిలిపివేశారు. రైల్వే ప్రత్యేక బృందాలు బోగీలను విడగొ ట్టి, అనంతరం పట్టాలు తప్పిన కం పార్ట్‌మెంట్‌ బోగీని రైలు పట్టాల మీద నుంచి క్రేన్ల సహాయంతో ప క్కకు తోసేశారు. దీంతో హొస్పేట్‌ వైపు నుంచి బెంగళూరుకు వెళ్లు రై లు మధ్యాహ్నం 2.25 గంటలకు చేరుకోవాల్సి ఉండగా.. ఆరు గంటలకు చేరుకుంది. అప్పటివరకు ప్ర యాణికులు రైల్వే స్టేషనలోనే నిరీక్షించారు. సాయంత్రం 6 గంటలకు రై ల్వేలైన పునరుద్ధరించడంతో యథావిధిగా రైళ్లు, వ్యాగన్లు తిరగడం ప్రారంభించాయి.

Updated Date - 2021-10-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising