ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనలో ప్రజాస్వామ్యం.. అపహాస్యం: టీడీపీ

ABN, First Publish Date - 2021-01-22T06:01:26+05:30

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు ధ్వజమెత్తారు.

కళ్యాణదుర్గంలో టీడీపీ ఇన్‌చార్జి ఉమా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కళా వెంకట్రావు అరెస్టుపై పెల్లుబికిన నిరసన


కళ్యాణదుర్గం, జనవరి 21: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు, బీసీ నేత కళా వెంకట్రావు అక్రమ అరె్‌స్టను నిరసిస్తూ గురువారం స్థానికంగా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్‌ భవన్‌ నుంచి గాంధీ చౌక్‌ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనకారులు బైఠాయించారు. ఈసందర్భంగా ఉమా మాట్లాడుతూ రెండేళ్ల వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతలు, సామాన్యులకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైన అరాచక పాలన అక్రమ కేసులు, అరె్‌స్టల పరంపరతో కొనసాగుతోందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు మహిళల భద్రత డోలాయమానంలో పడిందన్నారు. రాష్ట్రంలో అరాచకాలు నిత్యకృత్యమవుతున్నా అరికట్టడంతో పోలీస్‌ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దోపిడీ పాలనకు త్వరలో నూకలు చల్లే సమయం దగ్గరపడిందన్నారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు దొడగట్ట నారాయణ, బిక్కి గోవిందప్ప, కొల్లప్ప, మాదినేని మురళి, తలారి సత్యప్ప, రాజశేఖర్‌ చౌదరి, పోస్టు పాలన్న, జయరాములు, బ్రహ్మయ్య, నాగరాజు, రామాంజినేయులు, వేలూరి అరవింద్‌, మంజునాథ్‌ రెడ్డి, లాల్‌కృష్ణా, హనుమేష్‌, శీన, సుధాకర్‌నాయుడు, ఆంజినేయులు, బసవరాజు, బ్రిజేష్‌, రాయల్‌ హర్షా పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-22T06:01:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising