ప్రత్యేక హోదా కోసం నిలదీయండి
ABN, First Publish Date - 2021-10-29T06:06:24+05:30
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రప్రభుత్వాన్ని నిలదీయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
తాడిపత్రిటౌన, అక్టోబరు 28: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రప్రభుత్వాన్ని నిలదీయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీనివాసపురం శ్రీకృష్ణదేవరాయ కమ్యూనిటీ హాలులో జరు గుతున్న సీపీఎం 13వ జిల్లా మహాసభల సందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతున్నా రాష్ట్ర హక్కుల గురించి ఆలోచించడం లేదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ప్ర త్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. రాయలసీమకు కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని పొందుపరిచినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్‌పరం చేస్తుండటం దారుణమన్నారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు బీజేపీని కనీసం విమర్శించడం లేదన్నారు. బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్లు రాకుండా చేయాలని ప్రజలను కోరారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ఓ బులు మాట్లాడుతూ జిల్లాలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. డీజల్, పెట్రోల్ ధరలను తగ్గించి కార్మికలోకాన్ని ఆదుకోవాలన్నారు. సమావే శంలో జిల్లా కార్యదర్శి నల్లప్ప, పట్టణ కార్యదర్శి నరసిం హారెడ్డి, రూరల్ కార్యదర్శి జగనమోహనరెడ్డి, ఉమాగౌడ్ పాల్గొన్నారు.
Updated Date - 2021-10-29T06:06:24+05:30 IST