తగ్గుముఖం పట్టిన చిత్రావతి
ABN, First Publish Date - 2021-11-21T06:01:26+05:30
చిత్రావతికి వరద తగ్గినా రోడ్లు, గృహాలను బురద వదలడం లేదు. మున్సిపల్‌సిబ్బంది డోజర్లతో బురదను తొలగిస్తున్నారు.
డోజర్‌తో బురదను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది
పుట్టపర్తి, నవంబరు 20: చిత్రావతికి వరద తగ్గినా రోడ్లు, గృహాలను బురద వదలడం లేదు. మున్సిపల్‌సిబ్బంది డోజర్లతో బురదను తొలగిస్తున్నారు. దేవాలయాల్లో నీటిని సేవాదళ్ ఎత్తిపోస్తున్నారు. బాలికల వసతి గృహంలో నీటిని తొలగించడానికి వీలు కాకపోవడంతో పెదరాసు సుబ్రహ్మణ్యం తన పాఠఽశాలలో ఆశ్రయం కల్పించారు. అర్బన హెల్త్ సెంటర్ పోగ్రాం అఫీసర్ డాక్టర్ కుళ్ళాయప్పనాయక్ విద్యార్థులకు ముందస్తు వైద్యసేవలు అందించాలని సిబ్బందిని కోరారు.
Updated Date - 2021-11-21T06:01:26+05:30 IST