ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల ఉరికి నేతన్న బలి

ABN, First Publish Date - 2021-05-17T05:42:55+05:30

పట్టణంలోని కేతిరెడ్డి కాలనీ ఎల్‌-2కు చెందిన చేనేత కార్మికుడు నీరుగంటి వెంకటరాముడు (52) అప్పుల బాధ తాళలేక ఆత్మహ త్య చేసుకున్నాడు.

నీరుగంటి వెంకటరాముడు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరంఅర్బన్‌, మే 16: పట్టణంలోని కేతిరెడ్డి కాలనీ ఎల్‌-2కు చెందిన చేనేత కార్మికుడు నీరుగంటి వెంకటరాముడు (52) అప్పుల బాధ తాళలేక ఆత్మహ త్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు వెంకటరాము డు కూలీమగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవా డు. మొదటిదశ కరోనా సమయంలో పనులు లేక తీవ్ర ఇబ్బం దులకు గురై అప్పులు చేశాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటు న్న సమయంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిం చటంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. నేసిన చీరలకు గిట్టుబాటు ధరలేకపోవడం,  కర్ప్యూ వల్ల శిల్క్‌హౌ్‌సలు మూసివేయటంతో చీరలు అమ్ముడుపోలేదు. దీంతో కు టుంబాన్ని పోషించుకోవటం, అప్పులు  తీర్చే మార్గం కానరాక తరచూ తీవ్రంగా మథనపడేవాడు. ఈక్రమంలో  ఆదివారం ఉదయం ఇంటిలో ఎ వరూ లేని స మయంలో  చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం స్థానికుల ద్వా రా తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణా లను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనం తరం కుటుంబసభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి రూ.5లక్షల దాకా అప్పులున్నట్టు బం ధువులు పేర్కొంటున్నారు. మృతుడికి భార్య నాగలక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - 2021-05-17T05:42:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising