ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత సమస్యలు పరిష్కరించాల్సిందే: బీకే

ABN, First Publish Date - 2021-07-30T05:56:44+05:30

మండలంలో దళిత సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిం దేనని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అఽధ్యక్షుడు బీకే పార్థసారథి డిమాండ్‌ చేశారు.

నిరాహారదీక్షకు మద్దతు పలుకుతున్న బీకే, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొద్దం, జూలై 29: మండలంలో దళిత సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిం దేనని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అఽధ్యక్షుడు బీకే పార్థసారథి డిమాండ్‌ చేశారు. గురువారం రొద్దం తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్‌ నా యకులు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా బీకే, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, హిందూపురం పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ అందులో పాల్గొన్నారు. బీకే మాట్లాడుతూ.. ఎంజేపీ పాఠశాలలో రికార్డ్‌ అసిస్టెంట్‌గా  ఓ దళిత మహిళను టీడీపీ ప్రభుత్వం ఉన్నపుడు నియమించగా.. వైసీపీ వారు తొలగించడం అన్యాయమ న్నారు. అదేవిధంగా తురకలాపట్నం హ రిజనవాడలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, చేయూత పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి నరసింహులు, మాజీ వైస్‌ ఎంపీపీ నరసింహులు, మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు టైలర్‌ ఆంజనేయు లు, మాజీ ఎంపీటీసీ నాగేంద్ర, మాధవనాయుడు, మాజీ సర్పంచ్‌ అశ్వర్థనారాయ ణ, చిన్నపరెడ్డి, కొండయ్య, సానిపల్లి వెం కటేశ్‌ పాల్గొన్నారు.  

 


Updated Date - 2021-07-30T05:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising