ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన పరిపాలన రాషా్ట్రనికి శాపం: టీడీపీ

ABN, First Publish Date - 2021-10-19T06:12:19+05:30

సీఎం జగన పరిపాలన రాషా్ట్రనికి శాపంగా మారి అధోగతి పాలుచేసిందని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు విమర్శించారు.

దోసలుడికి రైతు సదస్సులో మాట్లాడుతున్న జితేంద్రగౌడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంతకల్లు, అక్టోబరు 18: సీఎం జగన పరిపాలన రాషా్ట్రనికి శాపంగా మారి అధోగతి పాలుచేసిందని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు విమర్శించారు. సోమవారం మండలంలోని దోసలుడికి, కొంగనపల్లి గ్రామా ల్లో టీడీపీ ఆధ్వర్యంలో రైతు సదస్సులు నిర్వహించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు రాషా్ట్రకి పవర్‌ కట్‌ అంటే ఏమిటో తెలియని విధంగా విద్యుత సరఫరా చేశారన్నారు. జగన్మోహన రెడ్డి పరిపాలనలో రైతులు కరెంటు కష్టాలను అనుభవిస్తున్నారన్నారు. విద్యుత చార్జీలను పెంచేయడంతో పాటు, పవర్‌కట్‌ వచ్చిపడ్డం రా ష్ట్ర ప్రజల నెత్తిపై పిడుగు పడ్డట్టయిందన్నారు. వర్షాలు కురవక, గిట్టుబా టు ధరల్లేక రైతులు ఓవైపు అష్టకష్టాలుపడుతుంటే.. వ్యవసాయ మోటార్ల కు మీటర్లను బిగించే యత్నంలో జగన ప్రభుత్వం ఉండటం హేయమన్నా రు.


చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే 14 వేల మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారని, 2019లో కరెంటు ఉత్పత్తి 24 వేల మెగా వాట్లకు పెంచి రాష్ట్ర అవసరాలకు వాడి, మిగులును ఇతర రాషా్ట్రలకు అమ్మిన ఘనత తమ నాయకుడిదన్నారు. జగన అధిక ధరలతో ఇతర రాషా్ట్రల నుంచి కరెంటును కొనాల్సిన అగత్యం రాషా్ట్రనికి కల్పించాడన్నారు. పరిపాలనలో అనుభవ లేమిని జగన చాటుకుంటున్నాడన్నారు. పింఛన్ల మొత్తాలను పెంచలేకపోవడం, రేషన కార్డులను ఏరివేయడం, అ మ్మ ఒడిని సకాలంలో ఇవ్వలేక చతికిలపడ్డం తదితర విషయాల వల్ల సీ ఎం అనుభవ రాహిత్యం వెల్లడి అవుతోందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగి తే రాష్ట్రం మరింత అధోగతి చెందుతుందన్నారు. ఇప్పటికే వైసీపీ ప్రజా ప్ర తినిధులు ఎక్కడికెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారని, రానున్న రోజుల్లో జనం దగ్గరకు వెళ్లాలంటే వారు జడుసుకునే పరిస్థితులు ఎదురవుతాయన్నారు. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే స్వయంగా జగనను విమర్శించడం పరిస్థితికి అద్దంపడుతోందన్నారు. ప్రజలు వెంటనే మేల్కొని రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా జగనను ఇంటికి సాగనంపి, చంద్రబాబుకు పట్టంగట్టాలన్నారు. లేదంటే క రెంటు కట్‌ వల్ల గ్రామాలు చీకట్లో మగ్గినట్లు మన పిల్లల భవిష్యత్తులు తప్పక అంధకారం అవుతాయన్నారు.  ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ రాయల రామయ్య, కౌన్సిలరు ఆర్‌ పవన కుమార్‌ గౌడు, టీడీపీ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి జీ వెంకటేశులు, సింగిల్‌విండో సొసైటీ మాజీ అధ్యక్షుడు పాల మల్లికార్జున, నాయకులు హనుమంతు, తలారి మస్తానప్ప, గాలి మల్లికార్జన, ముక్కన్నగారి రామాంజనేయులు, మండల నాయకులు రాఘవేంద్ర, ప్రసాదరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T06:12:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising