ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ఫ్యూ ఆంక్షలు అంతంతే..!

ABN, First Publish Date - 2021-05-17T06:09:16+05:30

నగరంలో ఆదివారం కర్ఫ్యూ ఆంక్షలు అమలు తీరు అంతంత మాత్రంగానే కొనసాగింది.

సప్తగిరి సర్కిల్లో ఉదయం 9 గంటల సమయంలో అనవసరంగా తిరుగుతున్న వాహనదారులకు ఫైన వేస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్రైం, మే16 : నగరంలో ఆదివారం కర్ఫ్యూ ఆంక్షలు అమలు తీరు అంతంత మాత్రంగానే కొనసాగింది. చాంబర్‌ ఆఫ్‌ కామార్స్‌ ప్రతినిధుల నిర్ణయంతో ఆదివారం ఉదయం నుంచి దుకాణాలు తదితర వ్యాపార సము దాయాలు మూతపడ్డాయి. కానీ నగరంలో జనాలు, వాహనాల రద్దీ మాత్రం తగ్గకపోవడం పలు విమర్శలకు తావి స్తోంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత కూడా నగరంలో వాహనాల రాకపోకలు ఎక్కు వుగా ఉండటంతో పోలీసులు తమదైన శైలిలో స్పందించారు. ఉదయం సమయంలో కొన్ని పలు దుకాణాలు, చికెన సెంటర్లు తదితరాల్లో యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మూసివేయించారు. కర్ఫ్యూ ఆంక్షల ఉల్లంఘన దారులపై జరిమానాలు విధించారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డి నేతృత్వంలో పలువు రు సీఐలు, ఎస్‌ఐలు తదితర సిబ్బంది బృందాలుగా ఏర్పాడి ఉల్లంఘనదా రులను చెదరగొట్టారు. ఏది ఏమైనా నగరంలో ఆదివారం తగు స్థాయిలో కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయకపోవడం వల్ల నగరంలో ఇష్టారాజ్యంగా వాహనాచోదకులు తిరగడం కనిపించింది. కొవిడ్‌ కేసులు నగరంలో పెరుగుతు న్నప్పటీకి ప్రజల్లో మార్పురాకపోవడం గమనార్హం. అక్కడక్కడ మత్రం నగర వీధులు, ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. 


Updated Date - 2021-05-17T06:09:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising