ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ఫ్యూ కట్టుదిట్టం

ABN, First Publish Date - 2021-06-14T06:12:13+05:30

నగరంలో ఆదివారం కర్ఫ్యూ ఆంక్షలు కట్టుదిట్టంగా కొనసాగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనిఖీలు చేస్తున్న పోలీసులు



ఉల్లంఘనదారులపై పోలీసుల కొరడా..

 డ్రోన్‌ కెమెరాలతో నిఘా

అనంతపురం క్రైం, జూన్‌ 13 : నగరంలో ఆదివారం కర్ఫ్యూ ఆంక్షలు కట్టుదిట్టంగా కొనసాగాయి. ఉదయం ఆరు గంటల నుంచి నగరంలోని 1, 2, 3, 4 పట్టణ స్టేషన్ల సీఐలు ప్రతాపరెడ్డి, జాకీర్‌హుసేన్‌, రెడ్డెప్ప, కత్తి శ్రీనివాసులు తమ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి, తనిఖీలు ముమ్మరం చేశారు. అనవసరంగా బయటకు వచ్చిన వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వటంతోపాటు జరిమానాలు విఽ దించారు. అక్కడక్కడ కొందరు దుకాణదారులు గుట్టుగా వ్యాపారాలు  చేస్తుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, మూసివేయించారు. డ్రోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాలతో కర్ఫ్యూ ఆంక్షల అమలు తీరును పర్యవేక్షించి, ఉల్లంఘనదారులపై చర్యలు తీసుకున్నారు. మద్యం దుకాణాలు తెరిచి విక్రయాలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఆదివారం కర్ఫ్యూ, కొవి డ్‌ నిబంధనలు అతిక్రమించిన దుకాణదారులు, రెస్టారెంట్‌ నిర్వాహకులు, వాహనచోదకులు 490 మందికి జరిమానాలు విధించారు. మాస్క్‌ ధరించకుండా తిరుగుతున్న 1291మందికి జరిమానా విధించి, 131 ద్విచక్రవాహనాలు, ఆటోలను సీజ్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు తెలియజేశారు.


Updated Date - 2021-06-14T06:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising