ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే..: ఏపీటీఎఫ్‌

ABN, First Publish Date - 2021-07-30T05:54:44+05:30

ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు ఇ చ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సీపీఎస్‌ విదానాన్ని రద్దు చేయాల్సిందేనని ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

హిందూపురంలో వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


హిందూపురం టౌన్‌, జూలై 29: ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు ఇ చ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సీపీఎస్‌ విదానాన్ని రద్దు చేయాల్సిందేనని ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణంలో ధర్నా చేపట్టిన ఏపీటీఎఫ్‌ నాయకులు మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు సమస్యలనూ పరిష్కరించాలన్నారు. పీ ఆర్‌సీ అమలు, డీఏలు అందలేదని ప్రతినెలా 1న జీతాలు, పెన్షన్‌లు చెల్లించాలన్నారు. ప్రాథమిక పాఠశాల విలీనాన్ని ఆపాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. ఇలా మొత్తం 29 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ శ్రీనివాసులుకు అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎప్‌ నాయకులు  రవిశేఖర్‌, గురురాజారావు, సూర్యనారాయణరెడ్డి, మల్లికార్జున, అంజినమూర్తి, ఇస్మయిల్‌, ఫణిభూషణ్‌, వెంకటేశ్‌, సోమశేఖర్‌, సుధాకర్‌, వెంకటేశ్‌, నాగేంద్ర పాల్గొన్నారు. 

 


Updated Date - 2021-07-30T05:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising