ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు విస్తీర్ణం తగ్గడంపై అధ్యయనం చేయించాలి

ABN, First Publish Date - 2021-08-02T05:50:09+05:30

జిల్లాలో ఈ సంవత్సరం తీవ్రంగా తగ్గిన సాగు విస్తీర్ణంపై ఉన్నతస్థాయి నిపుణులచే అధ్యయనం చేసి, పరిష్కార చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌

అనంతపురం టౌన, ఆగస్టు 1: జిల్లాలో ఈ సంవత్సరం తీవ్రంగా తగ్గిన సాగు విస్తీర్ణంపై ఉన్నతస్థాయి నిపుణులచే అధ్యయనం చేసి, పరిష్కార చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు.  ఆదివారం ఆయన స్థానిక గణేనాయక్‌భవనలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ జిల్లాలో జూన, జూలై నెల ల్లో 128.4 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈ ఏడాది రెండింతలుగా 226.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. అయితే సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 40 శాతానికి పైగా తగ్గిందని, ఇంత గణనీయంగా తగ్గడానికి కారణాలు తెలుసుకొని పరిష్కార చర్యలు చేపట్టకపోతే జిల్లా తీవ్ర సంక్షోభంలోకి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు విస్తీ ర్ణం తగ్గుదలపై ఉన్నతస్థాయి వ్యవసాయ నిపుణుల చే తక్షణమే అధ్యయనం చేయించాలని కోరారు. గత ఐదు సంవత్సరాలుగా వ్యవసాయ సాగు తీవ్ర ఒడిదుడుకుల తో సాగుతోందని పేర్కొన్నారు. 2016 ఖరీ్‌ఫలో 6,08,162 హెక్టార్లలో సాగు కాగా, 2020లో 4,80,595 హెక్టార్లు, ఈ సంవత్సరం 3,14,000 హెక్టార్లలో మాత్రమే సాగైందన్నా రు. ఈ పరిస్థితి జిల్లాలో వ్యవసాయ సంక్షోభాన్ని తెలుపుతోందన్నారు. గతేడాది జూన, జూలై నెలల్లో 11.58 లక్షల ఎకరాలు సాగుచేయగా ఈ ఏడాది జూన, జూలై నెలల్లో 7.85 లక్షల ఎకరాలు మాత్రమే సాగైందన్నారు. 

ఈ సంవత్సరం సాధారణ సాగు 16.58 లక్షల ఎకరాల్లో కేవలం 47 శాతం మాత్రమే సాగు కావడం తీవ్ర ఆందోళనకర పరిణామమన్నారు.  2018 నుంచి పంట నష్టపరిహారం చెల్లించకపోవడం, ఇనపుట్‌ సబ్సిడీ, బీమా మొత్తం జిల్లా రైతులకు రూ.2,500 కోట్లు చెల్లిస్తామని ప్రకటించి అమలు చేయకపోవడం, కరోనా ప్రభావం, పెరుగుతున్న మందులు, ఎరువుల ధరలు, పంట పెట్టుబడి ఖర్చులు, ముఖ్యంగా ఈ ఏడాది భారీగా పెరిగిన డీజిల్‌ ధరల వంటి అనేక కారణాలు సాగు తగ్గుదలపై ప్రభావం చూ పాయన్నారు. వీటన్నింటినీ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి, నివారణ చర్యలు చేపట్టకపోతే జిల్లా వ్యవసాయం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదముందని పేర్కొన్నారు.


Updated Date - 2021-08-02T05:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising