ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతులకు పరిహారంలోనూ వివక్షేనా?

ABN, First Publish Date - 2021-11-26T06:04:03+05:30

విశాఖపట్నంలో ఓ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌ కావడంతో చనిపోయిన వారికి నష్టపరిహారం కోటి రూపాయలు ఇచ్చారని, అదే అనంతపురం జిల్లా కదిరిలో భవనం కూలిపోయి ఆరుగురు చనిపోతే కేవలం రూ.5 లక్షలు పరిహారం ఇవ్వడం ఏమిటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

కదిరి, నవంబరు 25: విశాఖపట్నంలో ఓ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌ కావడంతో చనిపోయిన వారికి నష్టపరిహారం కోటి రూపాయలు ఇచ్చారని, అదే అనంతపురం జిల్లా కదిరిలో భవనం కూలిపోయి ఆరుగురు చనిపోతే కేవలం రూ.5 లక్షలు పరిహారం ఇవ్వడం ఏమిటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఎందుకు ముఖ్యమంత్రి ఈ వివక్ష చూపుతున్నారని ఆయన ప్రశ్నించారు. కదిరిలో మృతిచెందిన ఒకొక్కరికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 2 లక్షలు ఇవ్వాల్సిందేనన్నారు. వర్షాలతో నష్టపోయిన వారిని ఆయన  గురువారం పరామర్శించారు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలో పర్యటన అనంతరం జిల్లాలోని తనకల్లు మండలం మండ్లిపల్లి ప్రాంతంలో ఆయన పర్యటించారు. అక్కడ రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న వరి పంటలకు ఎకరాకు రూ. 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మున్సిపాల్టీలో టౌనప్లానింగ్‌ అధికారి అవినీతిలో మునిగి తేలుతున్నారన్నారు. సంఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా.. ఎవరిపైనా చర్యలు లేవని అన్నారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథ్‌రెడ్డి, సీపీఐ జిల్లా సహా య కార్యదర్శి నారాయణస్వామి, రైతు సంఘం నాయకు లు కాటమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేమయ్య యాదవ్‌, సీపీఐ నాయకులు ఉన్నారు. 

Updated Date - 2021-11-26T06:04:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising