ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ ఉద్యోగిపై కౌన్సిలర్‌ భర్త దాడి

ABN, First Publish Date - 2021-07-30T06:22:36+05:30

ఇదివరకే పూర్తి అయిన ఇంటికి బిల్లు పెట్టను అన్నందుకు 14వ వార్డు సచివా లయ ఉద్యోగిపై ఓ కౌన్సిలర్‌భర్త దాడిచేసిన సంఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది.

విలేకరులతో మాట్లాడుతున్న రామాంజినేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరం, జూలై 29: ఇదివరకే పూర్తి అయిన ఇంటికి బిల్లు పెట్టను అన్నందుకు 14వ వార్డు సచివా లయ ఉద్యోగిపై ఓ కౌన్సిలర్‌భర్త దాడిచేసిన సంఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది. సచివాలయ ఉద్యోగి రామాంజినేయులు విలేకరులకు తెలిపిన వివ రాల మేర కు...తాను 14వ వార్డు సచివాలయంలో అ మెనిటీస్‌ సెక్రటరీగా పనిచేస్తున్నా. 12వవార్డు కౌన్సిలర్‌ ఉమాదేవి భర్త తొండమాల రవి ఇంటికి రమ్మని పిల వగా తనతోపాటు అడ్మినసెక్రటరీ భాస్క ర్‌ను కూడా పిలుచుకుని వెళ్లాను. అక్కడ అప్పటికే పూర్తి అయిన ఇంటిని చూపించి జీయో టాగింగ్‌, ఖాళీస్థలానికి, పునా దికి, గోడలకు బిల్లులు చేయాలని వత్తిడిచేశారు. అయితే అలాబిల్లు పెట్టడానికి కుదరదని చెప్పినందుకు నానా దుర్బాష లాడుతూ తనపై దాడిచేశారని రామాం జినేయులు తెలిపారు. దీనిని ఖండిస్తూ సచి వాలయ ఉద్యోగులు తాళాలు వేసి విధులను బహి ష్కరించారు. ఆ తరువాత కమిషనర్‌కు పిర్యా దు చేయ డానికి మున్సిపల్‌ కార్యాలయానికి వె ళ్లారు. కమిషనర్‌ పనినిమిత్తం వార్డులోకి వె ళ్లారు. దీంతో మళ్లీ వద్దామని వెను తిరిగి వెళ్లారు. ఈ విషయంపై కమిషనర్‌ మల్లికార్జునను వివ రణ అడగ్గా సచివాలయ ఉద్యోగిపై జరిగిన దాడిపై ఇంత వరకు తన దృష్టికి రాలేదని, వస్తే విచారిస్తానన్నారు.

Updated Date - 2021-07-30T06:22:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising