‘ఉపాధి’ అక్రమాలపై కేంద్ర కమిటీకి ఫిర్యాదు
ABN, First Publish Date - 2021-10-29T06:05:32+05:30
జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలులో జరుగుతున్న అక్రమాలపై కేంద్ర కమిటీ ప్రతినిధులకు టీడీపీ నేతలు, ఉపాధి హామీ పథకం మాజీ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాసమూర్తి, గడిపూటి నారాయణస్వామి ఫిర్యాదు చేశారు
అనంతపురం వైద్యం, అక్టోబరు 28: జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలులో జరుగుతున్న అక్రమాలపై కేంద్ర కమిటీ ప్రతినిధులకు టీడీపీ నేతలు, ఉపాధి హామీ పథకం మాజీ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాసమూర్తి, గడిపూటి నారాయణస్వామి ఫిర్యాదు చేశారు. శుక్రవారం కేంద్ర కమిటీ సభ్యులు అమరేంద్రప్రతాప్ సింగ్, కిరణ్‌కుమార్ పడియాను వారు కలిశారు. వైసీపీ పాలనలో ఉపాధి పనుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆధారాలతో వివరించారు. గతంలో చేసిన పనులను ప్రస్తుతం రికార్డుల్లో నమోదు చేసి, నిధులు దోచుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. 2018 నుంచి 2019 వరకు చేసిన పనులకు కోర్టు ఆదేశాలతో నిధులు మంజూరు చేసినా చాలాచోట్ల ఇవ్వడం లేదనీ, 30 శాతం వరకు కమీషన డిమాండ్ చేస్తున్నారని కమిటీకి తెలిపారు. కరువు జిల్లాకు వరమైన ఉపాధి పథకం పారదర్శకంగా అమలయ్యేలా చూడాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
Updated Date - 2021-10-29T06:05:32+05:30 IST