ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్వచ్ఛ సంకల్పం’ నిత్య ప్రక్రియ: కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-10-21T06:10:18+05:30

జిల్లాలోని పంచాయతీల్లో పరిశుభ్రతకు తలపెట్టిన స్వచ్ఛసంకల్పం కార్యక్రమాన్ని నిత్యప్రక్రియలా కొనసాగించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం రైల్వే, అక్టోబరు 20: జిల్లాలోని పంచాయతీల్లో పరిశుభ్రతకు తలపెట్టిన స్వచ్ఛసంకల్పం కార్యక్రమాన్ని నిత్యప్రక్రియలా కొనసాగించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సూచించారు. బుధవారం స్వచ్ఛ సంకల్పం ప్రారంభోత్సవాన్ని స్థానిక కలెక్టరేట్‌ ఎదురుగా నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే అ నంత వెంకటరామిరెడ్డి, జిల్లాపరిషత చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, జేసీ సిరి, రాష్ట్ర నాటక అకాడమీ చైర్‌పర్సన హరిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా 100 రోజుల్లో చేపట్టాల్సిన పనులపై ప్రణాళిక తయారు చేసి, అమలుకు శ్రీకారం చుట్టామన్నారు. ఇది వంద రోజులు చేసి, వదిలేసే ప్రక్రియ కాదనీ, నిత్యం అమలు చేస్తూ పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వం తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా వాహనాలను కూడా సరఫరా చేసిందన్నారు. మొదటి విడతలో జిల్లాకు మొ త్తం 70 వాహనాలు వచ్చాయన్నారు. ప్రాధాన్యతను బట్టి వాటిని పంచాయతీలకు కేటాయిస్తామన్నారు. నూతనంగా వచ్చిన చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. వాటిని జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, డీపీఓ పార్వతి.. పంచాయతీల సిబ్బందికి అప్పగించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణ, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌, జడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసులు, డీఎల్‌పీఓలు బాలాజీ, విజయ్‌కుమార్‌రెడ్డి, ఏఓ ఖాదర్‌బాషా, డీపీఆర్‌సీ కో-ఆర్డినేటర్‌ సౌజన్య, ఈఓఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-21T06:10:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising