ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-10-26T06:29:50+05:30

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి.. సంబంధిత అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి 

అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 25: జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి.. సంబంధిత అధికారులను ఆదేశించారు.  సోమవారం ఆమె కలెక్టరేట్‌లోని రెవెన్యూ హాల్‌లో జేసీలు నిశాంతకుమార్‌, సిరి, గంగాధర్‌గౌడ్‌, హౌసింగ్‌ జాయింట్‌ కలెక్టర్‌ నిశాంతితో సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన వ్యాక్సినేషన లక్ష్యాలను చేరుకునేలా అధికారులు పనిచేయాలన్నారు. మండల, డివిజన, మున్సిపల్‌ స్థాయిలో కొవిడ్‌ వ్యాక్సినేషన సర్వే చేపట్టాలన్నారు. ఎన్ని డోసులు వేశారు, పెండింగ్‌ వివరాలను మండల ప్రత్యేకాధికారులు.. తహసీల్దార్లు, ఎంపీడీఓలకు తెలపాలన్నారు. సమావేశంలో డీఆర్వో గాయత్రీదేవి, సీపీఓ ప్రేమచంద్ర, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, ఆర్డీఓ మధుసూదన పాల్గొన్నారు.


ఉపాధి పనులపై అవగాహన కల్పించండి

ఉపాధిహామీ పనులపై గ్రామాల్లో ప్రజలు, వార్డు సభ్యులు, సర్పంచలు, కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఎంపీటీసీలు, మండల అధికారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి.. ఎంపీడీఓలను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ నుంచి ఉపాధి పథకం ద్వారా చేపడుతున్న పనులపై ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉపాధిహామీ పథకం నిధులను పెద్దఎత్తున వినియోగించుకోవాలన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ ఆదర్శవంతంగా ఉండాలన్నారు.  వీసీలో జేసీ సిరి, డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి, జడ్పీ సీఈఓ భాస్కర్‌ రెడ్డి, డీపీఓ పార్వతి, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ భాగ్యరాజు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T06:29:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising