ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ప్రభుత్వ చట్టాలు... రైతుల పాలిట శాపాలు

ABN, First Publish Date - 2021-07-30T05:54:44+05:30

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపాలుగా మారాయని సినీ నిర్మాత, నటుడు ఆర్‌. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై తీసిన రైతన్న సినిమా ప్రమోషనలో భాగంగా గురువారం జిల్లాకొచ్చిన ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతన్న సినిమాను ఆదరించండి

సినీ నిర్మాత, నటుడు ఆర్‌. నారాయణమూర్తి

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జూలై 29: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపాలుగా మారాయని సినీ నిర్మాత, నటుడు ఆర్‌. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై తీసిన రైతన్న సినిమా ప్రమోషనలో భాగంగా గురువారం జిల్లాకొచ్చిన ఆయన ప్రెస్‌క్లబ్‌లో  విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా ఉన్నాయన్నారు. ధరల నియంత్రణ, కనీస మద్ధతు ధర అంశాలేవీ ఆ చట్టాల్లో లేవన్నారు. స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో కార్పొరేటర్లకు వ్యవసాయాన్ని అప్పగిస్తే తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని, ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇదేగానీ జరిగితే రైతులు, వ్యవసా యం కనుమరుగవక తప్పదన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టే ఆలోచనను మానుకోవాలని హితవు పలికారు.  స్వామినాథన కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. రై తుల కష్టనష్టాలను ప్రత్యక్షంగా చూపించడం కోసమే రైతన్న సినిమాను తీశాననన్నారు. ఆగస్టు 15వ తేదీన సినిమా విడుదలవుతోందని, ప్రతిఒక్కరూ సినిమాను ఆదరించాలన్నారు. ఎక్కువ బడ్జెట్‌ పేరుతో సినిమా టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతులివ్వడమంటే అధికారికంగా బ్లాక్‌ మార్కెట్‌ చేయడమేనన్నారు.  ప్రస్తు తం ఓటీటీలో 20 శాతం సినిమాలు మాత్రమే నడుస్తున్నాయని, 80 శాతం సినిమాలు థియేటర్లపైనే ఆధారపడ్డాయన్నారు. కావున థియేటర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సినిమా టి క్కెట్టు ధరలపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌ రెడ్డి, మానతా రక్తదాత సంస్థల ప్రతినిధి తరిమెల అమర్నాథరెడ్డి, మానవహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎస్‌ఎం బాషా, ఏపీ రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ రెడ్డి, రెడ్స్‌ సంస్థ ప్రతినిధి భానుజా, ఐద్వా రాష్ట్ర నాయకులు సావిత్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్‌. నారాయణ మూర్తిని పలువురు రైతులు సన్మానించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగం, ప్రభుత్వ చట్టాలతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతన్న సినిమాను తీయడం పట్ల పలువురు రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. 


Updated Date - 2021-07-30T05:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising