ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చౌడేశ్వరీ దేవి జ్యోతుల మహోత్సవం

ABN, First Publish Date - 2021-01-16T06:25:31+05:30

పట్టణంలో గురువారం తొగటవీర క్షత్రియ, దేవాంగ కులస్థుల ఆధ్వర్యంలో వేర్వేరుగా చౌడేశ్వరీ దేవి జ్యోతుల మహోత్సవం సంబరంగా సాగింది.

దేవాంగుల ఆధ్వర్యంలో జ్యోతుల ఊరేగింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉరవకొండ, జనవరి 15: పట్టణంలో గురువారం తొగటవీర క్షత్రియ, దేవాంగ కులస్థుల ఆధ్వర్యంలో వేర్వేరుగా చౌడేశ్వరీ దేవి జ్యోతుల మహోత్సవం సంబరంగా సాగింది. ఐదేళ్లకోసారి జ్యోతులు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా పురమానకట్ట చౌడేశ్వరీ దేవి, కోట రామలింగ చౌ డేశ్వరీ దేవి ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉ దయం తొగటవీర క్షత్రియ ఆధ్వర్యంలో పులికాపు నీళ్లు, కలశాలను మేళతాళాల మధ్య ఊరేగించారు. సాయంత్రం గురుగుంట్ల బాల చౌడేశ్వరీదే వి అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. అర్ధరాత్రి జ్యోతులను భజనలు, బాజాభజింత్రీలతో పట్టణంలో ఊరేగించారు. పురమాన కట్ట చౌడేశ్వరి దేవి ఆలయానికి జ్యోతులను చేర్చారు. కార్యక్రమంలో తొగటవీర క్షత్రియుల కు లగురువు దివ్య జ్ఞానానందగిరి స్వామిని ప్రత్యేక వాహనంలో ఊరేగించా రు. అలాగే లక్ష్మీనరసింహ కాలనీ నుంచి రామలింగచౌడేశ్వరి దేవికి గంగా జలాలను మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేర్చారు. రాత్రి జ్యో తులను వెలిగించి ఆలయం నుంచి ఊరేగింపుగా కొండప్ప బావి రామలింగచౌడేశ్వరి దేవి ఆలయానికి చేర్చారు. జ్యోతుల ఉత్సవాల సందర్భంగా ఉరగాద్రి చౌడేశ్వరి దేవి ఆలయంలో జ్వాలా దర్శనం ఏర్పాటు చేశారు. జ్యో తుల ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పట్టణమంతా అమ్మవారి నామస్మరణతో మార్మోగింది.


అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

పట్టణంలో జ్యోతుల ఉత్సవాలలో భాగంగా చౌడేశ్వరి దేవి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్‌కు ఆయా ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. రామలింగచౌడేశ్వరి, ఉరగాద్రి చౌడేశ్వరి, పురమానకట్ట చౌడేశ్వరిదేవి అమ్మవార్లను మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యేలు శివరామి రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, వైసీపీ నాయకులు మధుసూధన రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉరగాద్రి చౌడేశ్వరి అమ్మవారిని దయానందపురి స్వామి, ఆదోని చౌకీమఠం పీఠాధిపతి కల్యాణస్వామి దర్శించుకున్నారు.  

Updated Date - 2021-01-16T06:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising