ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్రావతి నది వంతెన పరిశీలన

ABN, First Publish Date - 2021-12-04T05:39:32+05:30

ఇటీవల భారీ వర్షాలు, కర్ణాటకలో వచ్చిన వరదలతో ధ్వంశమైన మోతుకపల్లి వద్ద గల చిత్రావతి కాజ్‌వే నిర్మాణాన్ని శుక్రవారం జిల్లా పంచాయతీ రాజ్‌ శాఖ ఎస్‌ఈ భాగ్యరాజ్‌ పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలమత్తూరు, డిసెంబరు 3: ఇటీవల భారీ వర్షాలు, కర్ణాటకలో వచ్చిన వరదలతో ధ్వంశమైన మోతుకపల్లి వద్ద గల చిత్రావతి కాజ్‌వే నిర్మాణాన్ని శుక్రవారం జిల్లా పంచాయతీ రాజ్‌ శాఖ ఎస్‌ఈ భాగ్యరాజ్‌ పరిశీలించారు. నవంబరు 29న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన ‘వరదపోటు...వంతెనలకు చేటు’ కథనానికి ఆయన స్పందించారు. మండలంలో కుషావతి, చిత్రావతి నదులు ప్రమాద స్థాయిలో పొంగి పొర్లడంతో బ్రిడ్జిలు తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయాలు కలిగాయి. దీంతో ఆయన  మోతుకపల్లి వద్ద తెగిన చిత్రావతి నదు కాజ్‌వేని పరిశీలించారు. భారీగా కాజ్‌వే నిర్మాణం దెబ్బతినడంతో శెట్టిపల్లి పంచాయతీలోని పలు గ్రామాల నుంచి మోతుకపల్లి, పోతులప్పపల్లి, పెద్దిరెడ్డిపల్లి, చాగలేరు గ్రామాలకు పూర్తీగా రాకపోకులు నిలిచిపోయాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రాకపోకలకు వీలుగా తాత్కాలిక మరమత్తులకు రూ.10 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కాజ్‌వే కాకుండా అప్పర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపడితేనే శాశ్వత పరిష్కారమని శెట్టిపల్లి సర్పంచ చామంతి, ఎంపీటీసీ జగన్మోహనరెడ్డి ఆయనను కోరగా అందుకోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ ఇరిగేషన ఈఈ వేణుగోపాలరెడ్డి, జేఈ వెంకటరమణ, పీఆర్‌ ఎఈ గిరిజ తదితరలు ఉన్నారు. 


Updated Date - 2021-12-04T05:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising