ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాదరణ ఓర్వలేకే ప్రభాకరరెడ్డిపై కేసులు

ABN, First Publish Date - 2021-08-03T07:00:32+05:30

తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకరరెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి, ఓర్వలేకనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.

మాట్లాడుతున్న బుగ్గయ్యచౌదరి, కిరణ్‌గౌడ్‌, జేఎల్‌ మురళి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు.. టీడీపీ నేతల ధ్వజం

అనంతపురం వైద్యం, ఆగస్టు2: తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకరరెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి, ఓర్వలేకనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు బుగ్గయ్య చౌదరి, జేఎల్‌ మురళీధర్‌, జిల్లా అధికార ప్రతినిధి కిరణ్‌గౌడ్‌, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు గుత్తా ధనుంజయనాయుడు తదితరులు విలేకరుల స మావేశంలో మాట్లాడారు. తాడిపత్రిని జేసీ ప్రభాకరరెడ్డి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. మీసాలు తిప్పారని కేసులు పెట్టడం దు ర్మార్గమన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే పోలీసులకు కనిపించలేదా? చట్టం ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను వైసీపీ ప్రభుత్వం దుర్వినియో గం చేస్తూ మళ్లీ ఆ ఎస్సీలపైనే దాడులు చేస్తున్నారన్నారు. కొం దరు పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా మారి, ఇలాంటి అ రాచకాలకు పాల్పడుతున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదనీ, పాలకపక్షం మారాక ఈరోజు వైసీపీ తొత్తులుగా మారి, ఓవరాక్షన్‌ చేసిన పోలీసుల పరిస్థితి ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోవాలన్నారు. వైసీపీకి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ నాయకులు రాయల్‌ ము రళి, లక్ష్మీనరసింహ, కృష్ణకుమార్‌, డిష్‌ ప్రకాష్‌, మోహన్‌కుమార్‌, హేమంత్‌గౌడ్‌, రాజశేఖరరెడ్డి, మదన్‌మోహన్‌, గంగాద్రి, మాఽ దవ్‌, సునిల్‌, అనిల్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-08-03T07:00:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising