ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీ హబ్‌గా కార్బన్‌ హార్మోని సిటీ

ABN, First Publish Date - 2021-08-03T07:02:50+05:30

కార్బన్‌ హార్మోని సిటీని ఇన్ఫర్మేషన్‌ టె క్నాలజీ (ఐటీ) హబ్‌గా మార్పు చేయనున్నట్లు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి పేర్కొన్నారు.

వివరాలను వెల్లడిస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, ఎండీ రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి

అనంతపురం అర్బన్‌, ఆగస్టు 2: కార్బన్‌ హార్మోని సిటీని ఇన్ఫర్మేషన్‌ టె క్నాలజీ (ఐటీ) హబ్‌గా మార్పు చేయనున్నట్లు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాప్తాడు సమీపంలోని జాతీయ రహదారి పక్కనున్న కార్బన్‌ హార్మోని సిటీ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అనంతపురం నగరానికి చైన్నై, బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఇంజనీరింగ్‌ చదివిన జిల్లా యువత విదేశాలు, ఇతర నగరాలకు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా హార్మోని సిటీని ఐటీ హబ్‌గా మార్పుచేసేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. ఇందులో భాగంగా 5 నుంచి 10 వేల మంది యువతకు రూ.లక్ష వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. టూటైర్‌ నగరాల్లో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రాయితీలు అందిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సంస్థల ఏర్పాటకు అన్నిరకాల ప్రోత్సాహాలు కల్పించేందుకు కృషిచేస్తోందన్నారు. కార్బన్‌ హార్మోని సిటీలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎలక్ర్టానిక్‌ పార్కు నిర్మించేందుకు కసరత్తు ప్రారంభించామన్నారు. అనేక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. భవిష్యత్‌లో ఐటీ రంగానికి హార్మోని సిటీ మారు పేరుగా నిలిచిపోతుందన్నారు. క్రీడా, వినోద సౌకర్యాల ఏర్పాటు, 24 గంటలు వైద్యసేవలు, 120 ఎకరాల్లో ప్రపంచస్థాయి సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటు, ఏకీకృత పని ప్రదేశంగా హార్మోని సిటీని తీర్చిదిద్దటం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యేని హార్మోని సిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హార్మోని సిటీ ఎండీ రవికుమార్‌, జీఎం ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T07:02:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising