ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 నుంచి భక్తరహళ్లి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2021-12-02T05:46:21+05:30

ప్రసిద్ధిగాంచిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రిక లను ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి, ఆలయ కమిటీ సభ్యులు బుధవారం విడుదల చేశా రు.

గోడపత్రికలు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మడకశిరటౌన, డిసెంబరు 1: ప్రసిద్ధిగాంచిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రిక లను ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి, ఆలయ కమిటీ సభ్యులు బుధవారం విడుదల చేశా రు. మండల పరిఽధిలోని భక్తరహళ్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడికుంట ఆంజనేయస్వా మి బ్రహ్మోత్సవాలు ఈనెల 16వతేదీ నుంచి 22వతేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన గోడపత్రికలను ఎమ్మెల్యే చేతుల మీదుగా విడుదల చేశారు. ఈనెల 16వతేదీన ధ్వజారోహణ, అంకురార్పణ, స్వామివార్లకు అభిషేకాలు, హనుమత వ్రతం, హో మాలు, నిర్వహించనున్నారు. 17వతేదీన స్వామివార్లకు కల్యాణోత్సవ కార్యక్రమం, 18న బ్రహ్మరథోత్సవం, 19వతేదీన భూతప్పల ఉత్సవం, జ్యోతుల పరుష, గ్రామోత్సవం, 20వతేదీ తలనీలాలు, 21వతేదీన కంబాల నరసింహస్వామి దేవస్థానానికి జ్యోతుల పరుష, 22న స్వామివారికి వసంతోత్సవం, చక్రస్నానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన హనుమంతేగౌడ్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-02T05:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising