ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు మెరుగైన సేవలందించాలి

ABN, First Publish Date - 2021-08-25T06:35:44+05:30

ప్రభుత్వం ద్వారా వచ్చే పథకా లను రైతులకు లబ్ధిచేకూరేలా మెరుగైన సేవలందించి బ్యాంకు పరపతిని పెంచాలని ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన ఎం లిఖిత పేర్కొ న్నారు.

సిబ్బందితో మాట్లాడుతున్న చైర్‌పర్సన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన లిఖిత

ధర్మవరంరూరల్‌, ఆగస్టు24: ప్రభుత్వం ద్వారా వచ్చే పథకా లను రైతులకు లబ్ధిచేకూరేలా మెరుగైన సేవలందించి బ్యాంకు పరపతిని పెంచాలని ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన ఎం లిఖిత పేర్కొ న్నారు. మంగళవారం పట్టణంలోని ఏడీసీసీ బ్యాంకును చైర్‌పర్సన అకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది హాజరుపట్టికను, పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం చైర్‌పర్సన మాట్లాడు తూ ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి రైతాంగానికి కట్టుబడి ఉన్నా రని, రైతులకు వ్యవసాయరుణాలు అందించి రైతాంగం అభివృద్దికి పాటుపడాలన్నారు. రుణాల రెన్యువల్స్‌, రికవరీలో రైతులకు ముం దస్తుగా సమాచారం అందించి, సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం చైర్‌పర్సనను బ్యాంకు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన వీరాంజినేయులు, ఏజీఎం శ్రీని వాసులు, మేనేజర్‌ చంద్రభరతకుమార్‌, సూపర్‌వైజర్‌ పురుషోత్తం, గొట్లూరు బ్యాంకు సీఈఓ నారాయణస్వామి, నరసింహరెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు. 

పుడా చైర్‌పర్సనకు సన్మానం

పుట్టపర్తి: పుట్టపర్తిఅర్బన డెవలప్‌మెంట్‌ అథారిటీకి తొలి మహిళా చైర్‌పర్సనగా ఎంపికైన గెనికాని లక్ష్మీనరసమ్మను ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన లిఖిత ఘనంగా సన్మానించారు. ఈమేరకు మంగళవారం  ఆమె పుడా చైర్‌పర్సన గృహంలో కలిసి దుశ్శాలువ, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈసం దర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రానికి చైర్‌పర్సన కావడం ఎంతో ఆనందదాయకం అని అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని పుట్టపర్తి సర్వతోముఖా భివృద్దికి కృషి చేయాలని ఆమె సూచించారు.


Updated Date - 2021-08-25T06:35:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising