ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు అందని కందిపప్పు

ABN, First Publish Date - 2021-04-18T06:18:22+05:30

య్యం కార్డు దారుడికి అందవలసిన కందిపప్పు ఏప్రిల్‌ కోటాలో అందలేదు. పంపిణీ చేసే వాహనాల వద్ద కార్డుదారులు కందిపప్పు అడుగుతున్నా మాకుఅందలేదంటూ సమాధానం ఇస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-ఏప్రిల్‌లో బియ్యం, పంచదారతోనే సరి

హిందూపురం టౌన, ఏప్రిల్‌ 17: బియ్యం కార్డు దారుడికి అందవలసిన కందిపప్పు ఏప్రిల్‌ కోటాలో అందలేదు. పంపిణీ చేసే వాహనాల వద్ద కార్డుదారులు కందిపప్పు అడుగుతున్నా మాకుఅందలేదంటూ సమాధానం ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు రూ.90ఉండటంతో చౌకధాన్య డిపోల ద్వారా తక్కువ ధరకే అందించేందుకు శ్రీకారం చుట్టారు. కానీ కందిపప్పు ఇవ్వకపోవడంపై కార్డుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈనెలలో రెండు పండగలు వస్తాయి. దీంతో కందిపప్పు వస్తుందని లబ్దిదారులు భావించారు. తీరా రేషన సరుకులు ఇంటివద్దకు వచ్చేసరికి బియ్యం, పంచదారా మాత్రమే ఉంది. లబ్దిదారులు ఉసూరు మనాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం ఉగాది కానుకలో అన్ని సరుకులు అందించేవారు. కానీ ప్రస్తుతం ఇస్తున్నది బియ్యం, పంచదారా, కందిపప్పు అందులో కూడా కందిపప్పు లేకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక కొంతమందైతే బ్లాక్‌ మార్కెట్‌కు అమ్ముకున్నారంటూ బహిరంగంగా విమర్శిస్తున్నారు. 




Updated Date - 2021-04-18T06:18:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising