ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మానుష్యంగా నగర వీధులు

ABN, First Publish Date - 2021-05-09T06:27:03+05:30

మధ్యాహ్నం 12 గంటల వరకు విపరీతమైన రద్దీతో ఉన్న నగర ప్రధాన కూడళ్లు, రోడ్లు ఆ తరువాత నిర్మానుష్యంగా మారా యి.

నిర్మానుష్యంగా మారిన సుభాష్‌ రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మధ్యాహ్నానికి మూతపడ్డ దుకాణాలు

నిలిచిపోయిన వాహనాలు, జనసంచారం

అనంతపురం క్రైం, మే8 : మధ్యాహ్నం 12 గంటల వరకు విపరీతమైన రద్దీతో ఉన్న నగర ప్రధాన కూడళ్లు, రోడ్లు ఆ తరువాత నిర్మానుష్యంగా మారా యి. కరోనా సెకెండ్‌ వేవ్‌ నేపథ్యంలో తలపెట్టిన కర్ఫ్యూ ఆంక్షలతో శనివారం మధ్యాహ్నం 12గంటలకే నగరంలోని దుకాణాలు, తదితర వ్యాపార సముదా యాలు స్వచ్చందంగా మూతపడ్డాయి. కొందరు యథావిధిగా విక్రయాలు సాగి స్తుండటంతో నగరంలోని పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక దాడులు చేసి  మూతవేయించారు. దీంతో నగరంలో ఎక్కడిక్కడ దుకాణాలు మూతవేయడం తో రాకపోకలు ఉన్నఫలంగా స్తంభించి పోయాయి. మ ధ్నాహ్నం నుంచి నగరం ప్రశాంతంగా మారింది. నగర వీధులు ఖాళీగా దర్శన మిచ్చాయి. అక్కడక్కడ కొందరు యువకులు మాత్రం ద్విచక్ర వాహనాలలో తిరుగుతుండటంతో వారికి పోలీసులు కౌన్సిలింగ్‌ చేసి ఇళ్లకు పంపించేశారు. అంతేకాకుండా మధ్యాహ్నం తరువాత అనవసరంగా బయటకు వచ్చిన ఆటోలు, ద్విచక్ర వాహనాలు తదితర వాటికి పోలీసులు జరిమానా విధించారు. ఇదిలా ఉండగా.. నిత్యం రద్దీగా ఉండే టవర్‌ క్లాక్‌, సప్తగిరి సర్కిల్‌, శ్రీంకంఠం సర్కిల్‌ తదితర ప్రధాన కూడళ్లు కర్ఫ్యూ ఆంక్షలతో బోసిపోయాయి. అదేవిధంగా ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు యఽథావిధిగా నిరంతరం కర్ఫ్యూ ఆంక్షలకు కామర్‌ ఆఫ్‌ మర్చెంట్‌ అసోసియేషన నాయకులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. వ్యాపారాలు బంద్‌ చేస్తామని తెలియజేశారు.

Updated Date - 2021-05-09T06:27:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising