నేటి నుంచి వలంటీర్లకు పురస్కారాలు
ABN, First Publish Date - 2021-04-12T06:12:57+05:30
అత్యుత్తమ సేవలందించిన గ్రామ, వార్డు వలంటీర్లకు ఉగాది పండుగ రోజున పురస్కారాలు అందజేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో... జిల్లాలో సోమవారం నుంచే ఆ పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు
8 మూడు కేటగిరీల కింద అవార్డులు
అనంతపురం,ఏప్రిల్11(ఆంధ్రజ్యోతి) : అత్యుత్తమ సేవలందించిన గ్రామ, వార్డు వలంటీర్లకు ఉగాది పండుగ రోజున పురస్కారాలు అందజేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో... జిల్లాలో సోమవారం నుంచే ఆ పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సేవలు, నవరత్నాల పథకాలు ప్రజలకు అందిం చడంలో విశేష కృషి చేస్తున్న వలంటీర్ల సేవలకు జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో ఒక రోజు సత్కార కార్యక్రమంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలను అందజేస్తామన్నారు. ఈ నెల 24వ తేదీ వరకూ జిల్లాలో వలంటీర్లకు సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉత్తమ ప్ర తిభ కనబరిచిన వలంటీర్లకు సేవా వజ్ర, రత్న, మిత్ర అవార్డులను అందజేస్తా మన్నారు. సేవ వజ్ర పురస్కారానికి 70 మంది, సేవా రత్న పురస్కారానికి 380 మంది, సేవా మిత్ర పురస్కారానికి 16408 మంది వలంటీర్లను ఎంపిక చేశామన్నారు. వలంటీర్లకు మూడు కేటగిరీలుగా పురస్కారాలు అందజేస్తామన్నారు. సేవా వజ్రకు రూ.30వేలు, శాలువా, బ్యాడ్జీ, మెడల్, సర్టిఫికెట్, సేవా రత్న పురస్కారానికి రూ. 20 వేలు, శాలువా, బ్యాడ్జీ, మెడల్, సర్టిఫికెట్, సేవామిత్ర పురస్కారానికి రూ. 10 వేలు, శాలువా, బ్యాడ్జీ, మెడల్, సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు.
8 నేడు కళ్యాణదుర్గంలో..
అనంతపురం రైల్వే, ఏప్రిల్ 11: జిల్లాలో వలంటీర్లకు సత్కార కార్యక్రమంలో భాగంగా సోమవారం కళ్యాణదుర్గం మార్కెట్‌యార్డులో పురస్కార ప్రదానం ఉంటుం దని అధికారులు తెలిపారు. 14న అనంతపురంలోని జడ్పీ సమావేశ భవనంలో, 15న రాయదుర్గం మర్ధనేశ్వరి కల్యాణమండపంలో, పెనుకొండ ఎంపీడీఓ కార్యాలయంలో, 16న తాడిపత్రి మున్సిపల్ కాన్ఫరెన్స్‌హాల్‌లో, కదిరిలోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో, ఉరవకొండలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల వలంటీర్లను సన్మానించనున్నారు. అదేవిధంగా శింగనమల జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో, బుక్కరాయసముద్రంలో, 19న మడకశిర ఏంపీడీఓ కార్యాలయంలో, ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో, రాప్తాడు జడ్పీ స్కూల్‌లో, 20న హిందూపురంలోని ఎంపీడీఓ కార్యాలయంలో, 24న పుట్టపర్తిలోని ధర్మశాలలో, గుంతకల్లు ఎస్‌కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో సత్కార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జడ్పీలో జేసీ పరిశీలన
అనంతపురం విద్య, ఏప్రిల్ 11 : జిల్లాపరిషత్‌లో జరుగుతున్న వలంటీర్ల సన్మాన శాలువాలు, ప్రశంసా పత్రాల విభజన ప్రక్రియను జేసీ డాక్టర్ సిరి పరిశీలించారు. గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్ల సన్మానం నేపథ్యంలో శాలువలు భారీగా తెప్పించారు. ప్రశంసాపత్రాలు వచ్చా యి. దీంతో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో వాటిని మండలాల వారీగా విభజన చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో జరుగుతున్న ఈ ప్రక్రియను జేసీ సిరి పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభాస్వరూపరా ణి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసులు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-04-12T06:12:57+05:30 IST