ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనం చెంతకు కరోనా టీకా

ABN, First Publish Date - 2021-03-01T06:22:26+05:30

కరోనా టీకా సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఒక్కో డోస్‌ ధర నిర్ణయం

నేటి నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌

60 ఏళ్లు పైబడిన వారికి... 45 ఏళ్లు దాటి 

దీర్ఘకాలిక సమస్యలున్నోళ్లకు ...

ఏడు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నేడు ప్రారంభం

33 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనసాగింపు

అనంతపురం వైద్యం, ఫిబ్రవరి 28 : కరోనా టీకా సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు తొలి, మలి విడతల్లో కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియ ర్స్‌కు టీకా పంపిణీ చేస్తూ వచ్చారు. జనవరి 16వ తేదీ నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. తొలి విడతలో వైద్య, అంగన్‌వాడీ వర్గాలకు చెందిన 29981 మందికి టీకా వేయాలని గుర్తించారు. రెండో విడతలో మున్సిపల్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన 38174 మందికి, పోలీ్‌సశాఖకు చెందిన దాదాపు 7వేల మందికి టీకా వేయాలని నిర్ణయించి కొనసాగిస్తు వస్తున్నారు. అ యితే చాలా మంది కరోనా టీకా వేయించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. మొ త్తం 75155 మందికి గాను ఇప్పటి వరకు అధికార వర్గాలుచెబుతున్న ప్రకారం 26304 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. అపో హలుండటంవల్ల చాలా మంది టీకా వేయించుకోవడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. ఇటీవల కొత్తచెరువులో టీకా వేయించుకున్న ఒక ఆశా వర్కర్‌ మరణించగా జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీ ఆయా తీవ్ర అనారోగ్యానికి గురై ఏఎంసీలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో మూడో విడత టీకా ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభించ నున్నారు. అది కూడా సామాన్య ప్రజలకు అందుబాటు లోకి తీసుకొస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వారందరితో పాటు 45 నుంచి 59 సంవత్సరాలలోపు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా వేయనున్నారు. 


ప్రైవేట్‌లో ఒక్కో డోస్‌ రూ.250 

ఇప్పటి వరకు ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేట్‌ వైద్యులకు ఉచితంగా కరోనా టీకా పంపిణీ చేస్తూ వ చ్చారు. అయితే మూడో విడతలో ప్రైవేట్‌లోను అందుబా టులోకి తెస్తున్నారు. ఒక్కో డోస్‌ ధర రూ.250గా నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రులు అన్నింటిలోను అవకాశం కల్పించారు. జిల్లాలో 46 ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉండగా అందులో సోమవారం ఏడు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాత్రమే ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రంలో వైఎస్‌ ఆర్‌ ఆస్పత్రి, కిమ్స్‌సవీరా ఆస్పత్రి, పావని ఆస్పత్రి, చంద్రా ఆస్పత్రి, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి, హిందూపురం రాఘ వేంద్ర ఆస్పత్రి, కదిరి త్రివేణి ఆస్పత్రుల్లో టీకా వేయను న్నట్టు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌, డీఐఓ డాక్టర్‌ గంగాధర్‌రెడ్డి తెలిపారు. 33 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఈ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుందని,  తొలి రెండు విడతలతో పాటు మూడో విడత వారికి టీకా పంపిణీ చేస్తారన్నారు. టీకా కోసం వచ్చేవారు  గుర్తింపు కార్డు తీసుకురావాల్సి ఉంటుందన్నారు. అక్కడికక్కడే రిజి స్ర్టేషన్‌ చేసుకొని వ్యాక్సిన్‌ ఇస్తారని డీఎంహెచ్‌ఓ తెలిపారు.  

Updated Date - 2021-03-01T06:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising