ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడి వద్దు.. డిప్యుటేషనే ముద్దు..

ABN, First Publish Date - 2021-02-24T06:54:16+05:30

పాఠశాల, బోధన వద్దు.. డిప్యుటేషనే ముద్దు అన్నట్లు తయారయ్యారు పలువురు టీచర్లు. బడికి వెళ్లకుండా డిప్యుటేషన్ల మాటున జిల్లా కేంద్రంలో తిష్ట వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మధ్యాహ్నం 3.45 గంటలకే మూతపడిన పీడీపనిచేసే సమగ్రశిక్షలోని చాంబర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యాశాఖ, సమగ్రశిక్షలో ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లు

అనవసరంగా నియమించుకుంటున్నారన్న విమర్శలు

అమ్మఒడి ప్రక్రియ ముగిసినా.. ముగ్గురు టీచర్ల కొనసాగింపు

నాడు-నేడు పర్యవేక్షణకు సమగ్రశిక్ష అధికారులు

అయినా అదనంగా 14 మంది పీడీల కేటాయింపు

వారు కూడా చుట్టపుచూపుగా వస్తున్న వైనం

సొంత వ్యాపకాల్లో బిజీ..

పట్టించుకోని డీఈఓ, ఏపీసీ

పాఠశాలల్లో టీచర్ల కొరతతో బోధన గాలికి..

అనంతపురం విద్య, ఫిబ్రవరి 23:  పాఠశాల, బోధన వద్దు.. డిప్యుటేషనే ముద్దు అన్నట్లు తయారయ్యారు పలువురు టీచర్లు. బడికి వెళ్లకుండా డిప్యుటేషన్ల మాటున జిల్లా కేంద్రంలో తిష్ట వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవసరం లేకున్నా.. డిప్యుటేషన్లు కల్పించటం వీటికి బలం చేకూరుస్తోంది. ఉద్యోగులు లేని చోట.. అత్యవసరమైన చోటకు నియమిస్తే అర్థవంతంగా ఉంటుం ది. పనులు పూర్తయున చోట.. అధికారులున్నా.. అదనంగా మరికొందరిని నియమించటం విమర్శలకు తావిస్తోంది. పైగా పనిలేని, పూర్తయిన వాటికి ఎస్‌జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు, పీడీలను డిప్యుటేషన్‌పై నియమించటం శోచనీ యం. వీరు విధులకు ఎప్పుడొస్తారో కూడా తెలియని పరిస్థితి. విధులకు డుమ్మాకొట్టి, జిల్లా కేంద్రంలో సొంత పనుల్లో బిజీగా ఉంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీరి పర్యవేక్షణను డీఈఓ, ఏపీసీ గాలికొదిలేశారన్న విమర్శలు మూటగట్టకుంటున్నారు. దీంతో వారు ఆడింతే ఆటగా మారిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి


అమ్మఒడి పూర్తయినా...

అమ్మఒడి ప్రక్రియ నెల కిందటే పూర్తయింది. అమ్మఒడి సమస్యలు పరిష్కరించడానికి ముగ్గురు టీచర్లను వేశారు. వారిలో ఒకరుం టే.. మరో ఇద్దరు సొంత పనుల్లో ఉంటారు. ఇంగ్లీష్‌ స్కూల్‌ అసిస్టెంట్లు షమీమ్‌, ఆరిఫ్‌, ఆనంద్‌ను నియమించారు. మరో ఇద్దరు సీఆర్పీలను కూడా వేశారు. సీఆర్పీలను అటుంచితే.. డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న టీచర్లలో ఒకరు పనిచేస్తే.. మరో ఇద్దరు రెస్టు తీసుకుం టూ ఉంటారు. అ మ్మఒడి ప్రక్రియ పూర్తయి నెల గడిచినా.. అనవసరంగా టీచర్లను ఇక్కడే కొనసాగించటంపై విమర్శలు వస్తున్నాయి.


సమగ్రశిక్షలో మరీ దారుణం

నాడు-నేడు పనులు, జగనన్న విద్యాకానుక పేరుతో భారీగా టీచర్లు, పీఈటీ, పీడీలను డిప్యుటేషన్‌పై వేశారు. కొందరు రాజకీయ నాయకులు చెప్పారని నాడు-నేడు పనులకు గతంలోనే టీచర్లను డిప్యుటేషన్‌పై నియమించారు. దీనికితోడు కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు వచ్చాయంటూ... పీఈటీ, పీడీలను వేశారు. నాడు-నేడు పనులకే 14 మంది వ్యాయామ ఉపాధ్యాయులను నియమించారు. ఇద్దరు స్కూల్‌ అసిస్టెంట్లు, ముగ్గురు ఎస్‌జీటీలను కూడా కేటాయించారు. సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో సెక్టోరియల్‌ అధికారులు ఐదుగురు, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ అధికారులు 10 మంది కలిపి 15 మంది వరకూ ఉన్నారు. నాడు-నేడు, జగనన్న విద్యాకానుక, అమ్మఒడి తదితరాలను పర్యవేక్షించటమే వీరి పని. ఇవే పనులకు భారీగా డిప్యుటేషన్లు వేయటంపై ఆది నుంచీ విమర్శలు వస్తున్నాయి. పోనీ.. వేసినా.. పనిచేస్తున్నారా అంటే.. అదీ లే దన్న విమర్శలున్నాయి. వ్యాయామ ఉపాధ్యాయులు సమగ్ర శిక్ష కార్యాలయానికి నిత్యం హాజరై, పనులపై ఆరాతీయాలి. వీరిలో ఎవరు, ఎపుడు వస్తున్నారో కూడా వారిని నియమించిన అధికారులకు తెలియని పరిస్థితి. ఉదయం ఓ నలుగురు వచ్చినా.. వారు కూడా మధ్యాహ్నానికి ఉండరు. డిప్యుటేషన్‌పై వేసిన వారిలో చాలామంది సొంత వ్యాపకాల్లో బిజీ గా ఉంటున్నారని ఆ వర్గాలే పేర్కొంటున్నాయి. వీరిని పర్యవేక్షించాల్సిన డీఈఓ, ఏపీసీ గాలికొదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా వల్ల్ల అసలే స్కూళ్లు ఆలస్యంగా తెరిచారు. దీనికితోడు స్కూళ్లకు వెళ్లకుండా టీచర్లు, పీఈటీ, పీడీలు ఇలా డిప్యుటేషన్‌పై ఆఫీసుల్లో తిష్టవేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-02-24T06:54:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising