ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాట ఇచ్చి.. మోసం..

ABN, First Publish Date - 2021-07-30T06:19:17+05:30

: శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు వేతనాలు, పీఎఫ్‌ బకాయిలు ఖాతాలకు జమ చేస్తామని నమ్మించి, మోసం చేశారు.

శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరాను బంద్‌ చేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేతనాలు జమ కాకపోవడంపై శ్రీరామిరెడ్డి పథకం కార్మికుల ఆగ్రహం

మళ్లీ మెరుపుసమ్మె

అనంతపురం వైద్యం, జూలై 29: శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు వేతనాలు, పీఎఫ్‌ బకాయిలు ఖాతాలకు జమ చేస్తామని నమ్మించి, మోసం చేశారు. దీంతో కార్మికులు మరోసారి మెరుపు సమ్మెకు దిగారు. బకాయి వేతనాలు, పీఎఫ్‌ సొమ్ము చెల్లించాలంటూ కార్మికులు ఈనెల 11వ తేదీ నుంచి 15 రోజులపాటు సమ్మె సాగించా రు. వందలాది గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడి, జనం ఇబ్బందులు వచ్చారు. చివరకు రాష్ట్ర, జిల్లా అధికారులు ఈ సమ్మెపై సీరియ్‌సగా స్పందించి, పరిష్కారానికి ప్రయత్నిస్తూ వచ్చారు. మూడురోజుల క్రితం జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణ ఇతర డీఈలు, కలెక్టర్‌ ఆదేశాల మేరకు శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులతో చర్చించారు. ప్రభుత్వం రూ2.40 కోట్లు నిధులిచ్చిందనీ, వేతనాలకు వెంటనే జమ చేస్తామని అధికారులు, కాంట్రాక్టర్లు హామీ ఇచ్చారు. అందరి సమక్షంలోనే అదేరోజు కొంతమందికి జమ చేశారు. మరుసటిరోజు మిగిలిన వారందరికీ బ కాయి వేతనాలతోపాటు 8 నెలల పీఎఫ్‌ సొమ్మును జమ చేస్తామని హామీ ఇవ్వగా.. ఆ మేరకు ఒప్పందం చేసుకుని, కార్మికులు సమ్మె విరమించారు. నాలుగు రోజులు కావొస్తున్నా డబ్బు జమ చేయలేదు. రోజూ అధికారులను అడుగుతున్నా.. పట్టించుకోలేదు. అగ్రిమెంటు చేసుకొని మాట ఇచ్చి మోసం చేశారని కార్మికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీంతో గురువారం మళ్లీ జిల్లావ్యాప్తంగా శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. ప్రధాన కేంద్రాల్లో నీటి సరఫరా బంద్‌ చేశారు. దీనికి అధికారులే కారణమనీ, వారే బాధ్యత వహించాలని కార్మికుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఓబులు పేర్కొన్నారు. మొ త్తంమీద తాగునీటి కార్మికుల కథ మళ్లీ మొదటికి రావడం చర్చకు దారితీసింది.



నిధులొచ్చినా జీతాలివ్వరా..?

ఎల్‌అండ్‌టీ కార్యాలయాన్ని ముట్టడించిన సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు

అనంతపురం వైద్యం, జూలై29: ప్రభుత్వం నిధులిచ్చినా.. తమకు వేతనాలు జమ చేయకపోవడం ఏంటని సత్యసాయి తాగునీటి కార్మికులు.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ మేరకు గురువారం కార్మిక నేతలు గోవిందు, జగదీశ్వరరెడ్డి, రాజారెడ్డి, నరే్‌షతో కలిసి వందలాది.. జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో గల ఎల్‌అండ్‌టీ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడే బైఠాయించి, ఐదారు గంటలపాటు ఆందోళన కొనసాగించారు. అధికారులు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు వచ్చి వారితో మాట్లాడగా.. తీవ్రస్థాయిలోనే మండిపడ్డారు. ప్రభుత్వం రూ14.25 కోట్లు ఇస్తే.. తమకు జీతాలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. జీతాలు జమ చేస్తామని చెబితేనే సమ్మె విరమించామనీ, ఇప్పుడు మోసం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆగస్టు 10వ తేదీలోగా అందరికీ వేతనాలు జమ చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు నిరసన విరమించారు.

Updated Date - 2021-07-30T06:19:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising