ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాశాఖలో ఉత్కంఠ

ABN, First Publish Date - 2021-03-05T06:48:44+05:30

జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉత్కంఠ నెలకొంది.

విచారణ చేస్తున్న డైరెక్టర్‌, ఆర్జేడీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాఠశాలలకు బోగస్‌ అనుమతులపై డైరెక్టర్‌, ఆర్జేడీ విచారణ

హాజరైన అధికారులు, కరస్పాండెంట్లు

ఫైళ్లు, రికార్డుల పరిశీలన

అనంతపురం విద్య, మార్చి 4: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉత్కంఠ నెలకొంది. ఉన్నతస్థాయి అధికారుల నుంచి కింది స్థా సిబ్బంది వరకూ, పలు స్కూళ్ల కరస్పాండెంట్లలో టెన్షన్‌ కనిపించింది. గతంలో జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలకు ఫోర్జరీ సంతకాలతో బోగస్‌ అనుమతులు జారీ చేయటం, మాజీ, ప్రస్తుత డీఈఓలకు ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌ ఇవ్వటంపై ఆర్‌ఎంఎ్‌సఏ డైరెక్టర్‌ పార్వతి, ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి గురువారండీఈఓ ఆఫీసులో విచారణ చేశారు. మునుపటి, ప్రస్తుత డీ ఈఓలు జనార్దనాచార్యులు, శామ్యూల్‌తోపాటు, ఏడీలు రవూఫ్‌, దేవరాజ్‌, ఇతర అధికారుల ఆధ్వర్యంలో విచారణ చేశారు. అప్పట్లో అనుమతులిచ్చిన పాఠశాలల రి కార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా బోగస్‌ అనుమతులు జారీ అ యిన స్కూళ్ల కరస్పాండెంట్లను సైతం పిలిపించారు. వేర్వేరుగా అధికారులు, సి బ్బంది, కరస్పాండెంట్లను విచారించారు.


కరస్పాండెంట్లతో అసహనం

విచారణపై పాఠశాలల కరస్పాడెంట్లలో అసహనం వ్యక్తమైంది. ఉదయం 9 గంటలకు విచారణకు పిలిచారు. పెనుకొండ, ధర్మవరం, అనంతపురం తదితర డివిజన్ల నుంచి కరస్పాండెంట్లు ఉద యం 9 గంటలకే వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట అయినా వారిని లోపలికి పిలువలేదు. దీం తో కొందరు వెనక్కి వెళ్లిపోయారు. తర్వా త ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి పిలిచారు. ఏం జరిగిందో రాసివ్వాలంటూ అధికారులు కోరినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదిలేక నామమాత్రంగా కొందరు రాసిచ్చినట్లు సమాచారం. విచారణ పేరుతో పలుమార్లు తిప్పడంపై కరస్పాండెంట్లు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు పేపర్లలో రాయించి ఇచ్చామనీ, మళ్లీ రాసివ్వటం ఏంటనీ, ఎప్పుడో ముగియాల్సింది మళ్లీ విచారణ ఏంటం టూ వారు పెదవి విరుస్తున్నారు. 


ప్రతి విద్యార్థీ అత్యున్నత స్థాయికి ఎదగాలి

మధ్యాహ్నం అంబేడ్కర్‌ భవన్‌లో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేకాధికారులు, ప్రిన్సిపాళ్లతో ‘చదవడం మా కిష్టం’ అనే అంశంపై సమీక్ష నిర్వహించా రు. డైరెక్టర్‌ పార్వతి మాట్లాడుతూ ప్రతి విద్యార్థీ అత్యున్నత స్థాయికి ఎదగాలన్నా రు. కుటుంబం, సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. టీచ ర్లు నిరంతరం నేర్చుకుంటూ ఉండాలన్నారు. ప్రతి నిమిషం కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆలోచన విద్యార్థుల్లో క లిగేలా చూడాలన్నారు. అన్ని స్కూళ్లలో ఈ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి, డీఈఓ శామ్యూల్‌, ఏపీసీ తిలక్‌విద్యాసాగర్‌, డీసీఈబీ కార్యదర్శి ఫణికుమార్‌, సెక్టోరియల్‌, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ అధికారులు, సిబ్బం ది పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T06:48:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising