ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు మినీ ట్రక్కులు ప్రారంభం

ABN, First Publish Date - 2021-01-21T06:53:27+05:30

ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల పంపిణీకి సంబంధించిన మినీ ట్రక్కులను గురువారం ప్రారంభించనున్నారు.

తపోవనం వద్ద జాతీయరహదారిపై ఏర్పాటు చేస్తున్న వేదిక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తపోవనం వద్ద జాతీయ  రహదారిపై ఏర్పాట్లు

ట్రాఫిక్‌  మళ్లింపుతో వాహనదారుల ఇబ్బందులు

అనంతపురం వ్యవసాయం, జనవరి 20:  ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల పంపిణీకి సంబంధించిన మినీ ట్రక్కులను గురువారం ప్రారంభించనున్నారు. విజయవాడలో ఉదయం 9 గంటలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి వద్దకే సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇదే క్రమంలో జిల్లా కేంద్రంలోని తపోవనం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సభలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. జిల్లాకు 754 మినీ ట్రక్కులు కేటాయించారు. స్థానిక తపోవనం వద్ద జాతీయ రహదారిపై సభా వేదికను ఏర్పాటు చేశారు. దీంతో బుధవారం సాయంత్రం నుంచి ట్రాఫిక్‌ను మళ్లించారు. గుత్తి వైపు నుంచి వచ్చే వాహనాలను తపోవనం సర్కిల్‌ వద్ద నుంచి ప్లైఓవర్‌ కింద రోడ్డు మీదుగా వెళ్లేలా మళ్లించారు. దీంతో పెద్ద వాహనాలన్నీ బళ్లారి, కళ్యాణదుర్గం రోడ్ల మీదుగా రవి పెట్రోల్‌ బంకు వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి జాతీయ రహదారిపైకి వెళ్లాల్సి వస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బళ్లారి రోడ్డు, కళ్యాణదర్గం సర్కిళ్ల వద్ద పలుమార్లు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆర్ట్స్‌ కళాశాల ఎగ్జిబిషన్‌ మైదానంలో బుధవారం సాయంత్రం నుంచి మినీ ట్రక్కులను ఉంచారు. పలువురు పౌరసరఫరాలు, ఇతర శాఖల సిబ్బందిని పర్యవేక్షణకు ఉంచారు. వారికి ఆయా శాఖల పరంగా భోజన సదుపాయం కూడా కల్పించలేదు.







Updated Date - 2021-01-21T06:53:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising