ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేత్రపర్వం.. ప్రథమ దర్శనం

ABN, First Publish Date - 2021-08-11T06:34:08+05:30

గూగూడు గ్రామంలో వెలసిన కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం మంగళవారం రాత్రి నేత్రపర్వంగా సాగింది.

కుళ్లాయిస్వామి దర్శనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నార్పల, ఆగస్టు10: గూగూడు గ్రామంలో వెలసిన కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం మంగళవారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. గతేడాది బ్రహ్మోత్సవాల అనంతరం పెట్టె లో భద్రపరిచిన కుళ్లాయిస్వామి పీరును ఆలయ పూజారులు హుసేనప్ప, కొండన్న వంశీయులు బయటకు తీసి, శుద్ధి చేసి, మంగళవారం రాత్రి గ్రామ ప్రజలకు ప్రథమదర్శనం చేయించారు. బ్ర హ్మోత్సవాలకు బయటి వారికి అనుమతి లేదని ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు. ఆచారం ప్రకారం కుళ్లాయిస్వామి, ఆంజనేయస్వా మి సేవలకు మాత్రమే బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో దేవదాయ శాఖాధికారి మోహన్‌రెడ్డి, గ్రామ పెద్దలు శివశంకర్‌రెడ్డి, షాబీర్‌, రాజన్న, జాఫర్‌వలి, నరసింహులు, తలారి కుళ్లాయప్ప, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


బయటి భక్తులు రాకుండా చూడండి : ఆర్డీఓ

గూగూడుకు బయటి నుంచి భక్తులు రాకుండా చూడాలని ఆర్డీఓ మధుసూదన్‌ అధికారులను ఆదేశించారు. స్వామిని ఆర్డీఓ దర్శించుకున్నారు. ప్రథమ దర్శనం కేవలం గూగూడు గ్రామ ప్రజలకు మాత్రమే ఉంటుందనీ, వీరు కూడా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రమణమ్మ, తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి, ఎంపీడీఓ దివాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-11T06:34:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising