ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-02-27T06:28:45+05:30

మండలంలోని ఆమిద్యాల గ్రామానికి చెందిన రైతు వన్నూర్‌స్వామి (60) అప్పుల బాధ భరించలేక శుక్రవారం పొలంలో చెట్టుకు ఉరేసుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రైతు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉరవకొండ, ఫిబ్రవరి 26: మండలంలోని ఆమిద్యాల గ్రామానికి చెందిన రైతు వన్నూర్‌స్వామి (60) అప్పుల బాధ భరించలేక శుక్రవారం పొలంలో చెట్టుకు ఉరేసుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్నూర్‌స్వామి తనకున్న నాలుగెకరాల పొలంతోపాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి, వెళ్లాడు. పొలంలో పైపులైన్లు, వేరుశనగ పంట కోసం రూ.6 లక్షల దాకా అప్పులు చేశాడు. బ్యాంకులో కూడా అప్పులున్నాయి. పంటలు సరిగా పండక పోవటం, వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక పెన్నహోబిలం సమీపంలోని తన పొ లంలో చెట్టుకు ఉరేసుకుని, ప్రాణం తీసుకున్నాడు. సమీప పొలాల్లోని రైతులు గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారమందించారు. అప్పటికే రైతు చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రెండేళ్ల కిత్రం భార్య కూడా మృతిచెందింది. మృతుడికి నలుగురు  కుమార్తెలు, ఇద్దరు  కుమారులు ఉన్నారు. వీరిలో నలుగురు కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. రైతు ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-27T06:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising