ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఎమ్మెల్యే శారదాంబ కన్నుమూత

ABN, First Publish Date - 2021-01-27T07:04:58+05:30

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే శారదాంబ (83) అనారోగ్యంతో కన్నుమూశా రు.

శారదాంబ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణదుర్గం, జనవరి 26: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే శారదాంబ (83) అనారోగ్యంతో  కన్నుమూశా రు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 7 గంటలకు మృతిచెందినట్లు ఆమె సోదరుడు ఓబుళరాజు తెలిపారు. ఆమె ఉపాధ్యాయురాలిగా, ఎమ్మెల్యేగా సేవలు అందించారు. కుందుర్పి మండ లం కదరంపల్లి స్వగ్రామం కాగా, ఉద్యోగ రీత్యా పట్టణంలో స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం 1999లో కళ్యాణదుర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, సుమారు 50 వేల మెజార్టీతో గెలిచారు. అప్పట్లో పీపుల్స్‌వార్‌ ప్రాబల్యమున్నా ధైర్యంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. 2000లో రాళ్ల అనంతపురం గ్రా మంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను నక్సలైట్లు కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. గన్‌మెన్‌ వద్ద ఉన్న తుపాకులను లాక్కున్నారు. అయినా ధైర్యంగా నక్సలైట్లకు సమాధానం చెప్పిన మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు.


ఆమె మృతి తీరని లోటు

శారదాంబ మృతి పార్టీకి తీరని లోటు. ప్రజాసేవకురాలిగా, అజాత శత్రువుగా ఆమె ప్రజల మన్ననలు పొం దారు. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఆమె మృతికి ప్రగాఢ సంతాపం.

- ఉమామహేశ్వర్‌నాయుడు, టీడీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌


నిస్వార్థ సేవకురాలు

శారదాంబ ఉపాధ్యాయురాలిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు నిస్వార్థ సేవలు అందించారు. ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు చేశారు. ఆమె లేని లోటు తీర్చలేనిది.

- కాలవ శ్రీనివాసులు,  టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు

Updated Date - 2021-01-27T07:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising