ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌ ప్రధాని కావాలన్నది యువత ఆకాంక్ష

ABN, First Publish Date - 2021-06-20T06:29:00+05:30

కాంగ్రెస్‌ జాతీయ నేత రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని యువత కోరుకుంటోందని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ పేర్కొన్నారు.

రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌..

అనంతపురం రైల్వే, జూన్‌19: కాంగ్రెస్‌ జాతీయ నేత రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని యువత కోరుకుంటోందని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ పేర్కొన్నారు. రాహుల్‌ ప్రధాని అయితేనే ఇందిరా, రాజీవ్‌గాంధీల ఆశయ సాధన సాధ్యమన్నారు. శనివారం రాహుల్‌ గాంధీ పుట్టినరోజు సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన శైలజానాథ్‌ మాట్లాడుతూ.. కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. వ్యాక్సినేషన్‌లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే.. ప్రత్యేక హోదా తెస్తానని ప్రగల్భాలు పలికిన ము ఖ్యమంత్రి జగన్‌.. 25 మంది ఎంపీలతోపాటు ఆయన కూడా ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లముందు వంగి వంగి దండాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతా్‌పరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిఽధులు నాగరాజు, భాస్కర్‌రెడ్డి, శంకర్‌యాదవ్‌, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు దాదాగాంధీ, జిల్లా ఉపాధ్యక్షులు వాసు, రామానాయు డు, సూర్యనారాయణరెడ్డి, ప్రభాకర్‌, ఎన్‌ఎ్‌సయూఐ నేత నరేస్‌, జిల్లా అధ్యక్షుడు బాలాజీ నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T06:29:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising