ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్‌ను చురుగ్గా చేపట్టాలి

ABN, First Publish Date - 2021-06-13T06:48:41+05:30

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను చురుగ్గా చేపట్టాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ అధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైద్యరంగంలోని అన్నిశాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలి.. కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌

అనంతపురం, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను చురుగ్గా చేపట్టాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కొవిడ్‌ ప్ర ణాళికపై అధికారులతో సమావేశం నిర్వహి ంచారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వైద్యరంగానికి సంబంధించి అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచడంతోపాటు ఫలితాలు సత్వరమే వెల్లడించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీకాలు ఎప్పటికప్పుడు పంపిణీ చేయాలని ఆదేశించారు. కరోనా పరీక్షల నమూనాలను గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సేకరించాలన్నారు. కొ విడ్‌ మూడోవేవ్‌ రూపంలో మరోసారి విజృంభించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నోడల్‌, వైద్యాధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో వసతుల మెరుగుకు చర్యలు చేపట్టాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులు, విదేశాలకు వెళ్లే విద్యార్థుల కు టీకాలు వేయాలన్నారు. కరోనా బాధితుడు హోం ఐసొలేషన్‌లో ఉంటే ఉదయం 8 గంటల నుంచి ప్రతి నాలుగు గంటలకోసారి ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని గమనించి, వివరాలను చార్ట్‌ రూపంలో నమో దు చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీలు నిశాంత్‌కుమార్‌, డా.సిరి, నిశాంతి, గంగాధర్‌గౌడ్‌, డీఎంహెచ్‌ఓ కామేశ్వరప్రసాద్‌, కొవిడ్‌ నోడల్‌ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-13T06:48:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising