ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ మూడోవేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

ABN, First Publish Date - 2021-07-24T06:25:48+05:30

జిల్లాలో కొ విడ్‌ మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ నోడల్‌ అధికారులను ఆదేశించారు.

కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నోడల్‌ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

అనంతపురం,జూలై23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొ విడ్‌ మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ నోడల్‌ అధికారులను ఆదేశించారు. గతం పునరావృతం కాకుండా కొవిడ్‌ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలన్నారు.  శుక్రవారం ఆమె జడ్పీలోని డీఆర్సీ సమావేశపు హాల్లో నూతనంగా ఎంపికైన నోడల్‌ అధికారులతో సమీక్షా సమావేశా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ కొవిడ్‌ మొదటి, రెండో వేవ్‌లకంటే జిల్లాలో ఆక్సిజన్‌ సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. మూడోవేవ్‌ వస్తే ఆ మేరకు ఆక్సిజన్‌ పర్యవేక్షణ కమిటీ మీద ఒత్తిడి పెరిగే అవకాశముందన్నారు. రానున్న రోజుల్లో ఆస్పత్రుల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న 100 పడకల్లో కనీసం 50 ఆ క్సిజన్‌ పడకలు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల ద్వారా ఆక్సిజన్‌ అందించనున్నామన్నారు. కమ్యూనిటీ హెల్త్‌ కేర్‌ సెంటర్ల లో పైపులైన్‌ ద్వారా ఆక్సిజన్‌ అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సప్లయర్స్‌ నుంచి లిక్విడ్‌ ఆక్సిజన్‌ రవాణా, డిస్ర్టిబ్యూషన్‌, పైపులైన్‌ మేనేజ్‌మెంట్‌, ఆస్పత్రుల్లో వెంటి లేటర్‌ మేనేజ్‌మెంట్‌, సిబ్బంది నిర్వహణ పర్యవేక్షించాలన్నారు. రానున్న రోజుల్లో ర్యాపిడ్‌ టెస్టులు ఉండవన్నారు. కేవలం ఆర్టీపీసీఆర్‌ టెస్టింగ్‌లు మాత్రమే చేయాల్సి ఉంటుందన్నారు. టెస్టుల సంఖ్య సగటున రోజుకు కనీసం 10 వేలకు పెంచాలన్నారు. 12 గంటల నుంచి 24 గంటల్లో టెస్టు ఫలితాలు వెల్లడించాలన్నారు. సచివాలయాల వారి గా ప్రాంతాలను విభజించాలన్నారు. ఎక్కువ కేసులు న మోదవుతున్న సచివాలయాల పరిధిలో, వ్యాక్సినేషన్‌ త క్కువ జరిగిన ప్రాంతాల్లో ఎక్కువ టెస్టులు నిర్వహించా లని కోరారు. ఫీవర్‌ సర్వే పకడ్బందీగా చేపట్టాలని ఆదేశిం చారు. కొవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణ సక్రమంగా జరగాలన్నారు. ఇప్పటి నుంచే నోడల్‌ అధికారులు వారి పరిధిలో ఉన్న ఆస్పత్రులను ఒక్కసారైనా సందర్శించే అల వాటు చేసుకోవాలన్నారు. మూడోవేవ్‌ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందువల్ల పిల్లల వైద్యం కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. గ్రా మాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పా టు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో గ్రామస్థాయిలో ఐసొలేషన్‌ కేంద్రంగా ఉండాల్సిన భవనాలను ముందుగా రిజర్వు చేసుకోవాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు 104కు ఫోన్‌ చేసిన మూడు గంటల్లోగా ఆస్పత్రుల్లో పడక అందించేలా కాల్‌సెంటర్‌ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జేసీలు డా.సిరి, నిశాంతి, గంగాధర్‌ గౌడ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతేజ, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T06:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising