ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విత్తన, ఎరువుల దుకాణాలపై తనిఖీలు నిర్వహించండి

ABN, First Publish Date - 2021-06-18T06:43:25+05:30

జిల్లాలో విత్తనాలు, ఎరువులు విక్రయించే దుకాణాలపై నిరంతర తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్నకలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ-క్రాపింగ్‌ వందశాతం నమోదు కావాలి

జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌

అనంతపురం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో విత్తనాలు, ఎరువులు విక్రయించే దుకాణాలపై నిరంతర తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలకు ఆస్కారం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల కు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలన్నారు.  గురువారం ఆమె కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా లో ప్రతి ఎకరాలో పండిన పంట వివరాలు ఈ-క్రా్‌పలో నమోదు చేయాలన్నారు. మార్కెట్‌లో డి మాండ్‌ ఉన్న వంగడాలపై రైతులకు అవగాహన చేపట్టేలా మం డల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ-క్రాప్‌ నిర్వహిం చే ఉద్యోగులకు మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చే యాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణపు పనులను వేగంగా చేపట్టాలన్నారు. పం చాయతీరాజ్‌శాఖతో సమన్వయం చేసుకొని త్వరగా భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని వ్యవసాయశాఖాధికారులను ఆదేశించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ప్రకారం సమగ్ర విచారణ జరిపి త్వరి తగతిన నివేదిక అందించి వారికి ఆసరా కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో బ్యాంకులకు సంబంధించి ఒక సలహాదారు ఉండే విధంగా వ్యవసాయాధికారులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ నిశాంత్‌కుమార్‌, అసిస్టెం ట్‌ కలెక్టర్‌ సూర్యతేజ, వ్యవసాయశాఖ జేడీ రామకృష్ణ, ఉద్యానశాఖ డీడీ సతీష్‌, ఏపీఎంఐపీ పీడీ ఫిరోజ్‌ఖాన్‌, పట్టుపరిశ్రమ శాఖ జేడీ పద్మావతి, పశుసంవర్థకశాఖ జేడీ వెంకటేశు, వ్యవసాయ అనుబంధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T06:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising