ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ వచ్చేసిందోచ్‌..!

ABN, First Publish Date - 2021-04-14T06:49:44+05:30

జిల్లాకు ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది. టీకా లేక మూడు రోజులుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాకు 35 వేల డోసుల రాక

వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు సరఫరా

బుధవారమే  పూర్తికానున్న  టీకా పంపిణీ

అనంతపురం వైద్యం, ఏప్రిల్‌ 13: జిల్లాకు ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది. టీకా లేక మూడు రోజులుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లావ్యాప్తంగా టీకా కేంద్రాలు వెలవెలబోయాయి. అధికారులు సైతం వ్యాక్సిన్‌ రాకపోవడంతో ఏమీచేయలేకపోయారు. ఎట్టకేలకు కేంద్రం.. రాష్ట్రానికి వ్యాక్సిన్‌ పంపిణీ చేయగా.. రాష్ట్ర శాఖ నుంచి జిల్లాకు పంపించారు. జిల్లాకు 35 వేల కోవిషీల్డ్‌ టీకా డోసులు అందాయి. బుధవారం టీకా ఉత్సవ్‌ ముగింపు సందర్భంగా జిల్లావ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని ఇప్పటికే కలెక్టర్‌ గంధం చంద్రుడు.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా వైద్య శాఖాధికారులు మంగళవారం ఉగాది పండుగ ఉన్నా.. కరోనా టీకాను జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలకు తరలించారు. వచ్చిన టీకా డోసులు కూడా బుధవారం ఒక్కరోజే పూర్తి చేయనున్నారు. కోవాగ్జిన్‌ టీకా రాలేదు. దీంతో 2వ డోసు వేయించుకోవాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు. ఆ వ్యాక్సిన్‌ కోసం కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అది కూడా నేడో.. రేపో.. జిల్లాకు చేరే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-04-14T06:49:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising