కోరలు చాస్తున్న కరోనా
ABN, First Publish Date - 2021-03-28T06:38:21+05:30
ల్లాలో కరోనా సెకెండ్ వేవ్ టెన్షన్ పుట్టిస్తోంది. గత వారం రోజులుగా పెరుగుతున్న కేసులు అందరికీ భయాందోళన కలిగిస్తున్నాయి.
ఒక్కరోజులో కొత్తగా 35 కేసులు.. జిల్లా ఆస్పత్రిలో కొవిడ్ బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు
అనంతపురం వైద్యం, మార్చి 27: జిల్లాలో కరోనా సెకెండ్ వేవ్ టెన్షన్ పుట్టిస్తోంది. గత వారం రోజులుగా పెరుగుతున్న కేసులు అందరికీ భయాందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35 మంది కరోనా బారిన పడినట్టు అధికారులు శనివారం వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లా లో 68214 మంది కరోనా బారిన పడగా అందులో 67338 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 601 మంది మరణించారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 275 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా సర్వజనాస్పత్రిలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకోవడానికి అధిక మంది వస్తున్నారు. పాజిటివ్ వచ్చినవారు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరుతున్నారు. దాదాపు 40 మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో మరిన్ని బెడ్లు ఏర్పాటు చేశారు. శనివారం పీజీ క్వార్టర్స్‌లో మరో 40 నుంచి 60 మంది చికిత్స పొందేలా బెడ్లు ఏర్పాటు చేశారు. కొవిడ్ ఓపీ విభాగంలోనూ దాదాపు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు బెడ్లు సిద్ధం చేశారు. ఆక్సిజన్ యంత్రాలను ప్రతి బెడ్డుకు అమర్చారు. సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు వాటిని పర్యవేక్షిస్తూ అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ఆస్ప త్రిలో కొవిడ్ బాధితులు ఎక్కడపడితే అక్కడ తిరగకుండా వారు నడిచే ప్రాంతం, చికిత్స పొందే ఏరియాల్లో తడకలు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతానికి సాధారణ రోగులు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం మీద జిల్లా ఆస్పత్రిలో మళ్లీ కొవిడ్ టెన్షన్ మొదలైంది.
Updated Date - 2021-03-28T06:38:21+05:30 IST