ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి అంగన్‌వాడీలు పునఃప్రారంభం

ABN, First Publish Date - 2021-02-01T07:03:39+05:30

అంగన్‌వాడీ కేంద్రాలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి నుంచి ఈ కేంద్రాలు మూత పడిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేధిస్తున్న సమస్యలు

సరుకుల్లేకుండా మెనూ ఎట్లా అమలు చేస్తారో 

అడుగుదామంటే ఎవరు పీడీనో తెలియని స్థితి

మౌనంగా ఉంటున్న సీడీపీఓలు

అయోమయంలో కార్యకర్తలు 

అనంతపురం వైద్యం, జనవరి 31:  అంగన్‌వాడీ కేంద్రాలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి నుంచి ఈ కేంద్రాలు మూత పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఈ కేంద్రాల పరిధిలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, పాలు, గుడ్లు ఇళ్లకే అందజేస్తు వచ్చా రు. ఇప్పుడు సోమవారం నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు రీ ఓపెన్‌ కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా అధికారులు కేంద్రాల ప్రారంభానికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో క్షేత్ర స్థాయిలో సీడీపీఓలు, సూపర్‌వైజర్లు సైతం కేంద్రాలు సోమవారం నుంచి తెరవాలని అంగన్‌వాడీ వర్కర్లకు స మాచారం పంపించి సిద్ధం చేశారు. కాగా జిల్లాలో ప్రస్తు తం ఐసీడీఎస్‌ శాఖలో వింత పరిస్థితులు సాగుతున్నాయి. రెగ్యులర్‌ పీడీ లేరు. ఎంపీడీఓ విజయలక్ష్మిని కలెక్టర్‌ ఇన్‌చార్జ్‌ పీడీగా నియమించగా ఆమె ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర అధికారులు విజయలక్ష్మి నియామకాన్ని ఆమోదించలేదు. ఐసీడీఎస్‌ అదనపు పీడీగా కొనసాగుతున్న లక్ష్మీకుమారికి ఎఫ్‌ఏసీ ఇస్తూ పీడీగా రాష్ట్ర కమిషనర్‌, రాష్ట్ర డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీకుమారి చేరికపై జిల్లా కలెక్టర్‌ పెండింగ్‌ పెట్టి ఎన్నికలు తర్వాత జాయిన్‌ కావాలని సూచించినట్లు శనివారం ప్రచారం సాగింది. అయితే రాష్ట్ర అధికారులు ఇందుకు సమ్మతించలేదని ఏపీడీ లక్ష్మీకుమారిని బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెబుతున్నా రు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందో తెలీదు కానీ ఇన్‌చార్జ్‌ పీడీగా కొనసాగుతున్న ఎంపీడీఓ విజయలక్ష్మి, పీడీ అధికారిక సిమ్‌ను శనివారం రాత్రి ఏపీడీ లక్ష్మీకుమారికి అప్పగించినట్టు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇలా పీడీ పీఠంపై ఆ శాఖలో డ్రామా సాగుతూ వస్తోంది. 


సరుకుల్లేవ్‌... భోజనం ఎట్లా? 

అంగన్‌వాడీ కేంద్రాలు తెరుస్తుండటంతో వర్కర్లు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాలకు గత పది నెలలుగా సరుకులు సరఫరా లేదు. దీంతో కేంద్రాల్లో సరు కుల ఖాళీ అయ్యా యి. కేంద్రాలు తెరిస్తే అక్కడే పౌష్టికాహారం వండి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించాల్సి ఉంటుంది. జిల్లాలో 5126 కేంద్రాలు ఉన్నాయి. ఏడు నెలలు నుంచి మూడేళ్లలోపు పిల్లలు 1.45 లక్షలు, మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 1.05 లక్షల మంది ఉన్నారు. 37 వేల మంది గర్భిణులు, 35 వేల మంది బాలింతలు ఉన్నారు. వీరందరికి కేంద్రాలలోనే పౌష్టికాహారం వండి అందించాల్సి ఉంది. కొన్ని కేంద్రాల్లో బియ్యము ఉండగా మరికొన్ని కేంద్రాల్లో అవి కూడా లేవు. మరోవైపు వంట వండాలంటే కంది బేడ లు, నూనె, కారంపొడి, చింతపండు, పోపు దినుసులు, సాం బార్‌, రసంపొడులు ఉండాలి. కానీ ఒక్కటి కూడా లేవు. పిల్లలు కేంద్రాలకొస్తే ఏమి వండా లో, ఎలా పెట్టాలో అంగన్‌వాడీ కార్యకర్తలకు అంతుపట్టడం లేదు. అధికారుల సై తం కేవలం కేంద్రాలు తెరవాలని మెసేజ్‌లు పెట్టి చేతులు దులుపుకున్నారు. కనీసం కేంద్రాల్లో ఎలా వంటలు వండాలి ఏమి చేయాలి అని కూడా చెప్పే వారే కరువయ్యారని అంగన్‌వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని అడుగుదామని ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నిస్తే ఎవరు పీడీనో ఎవరు దీనికి అధికారో అర్థం కానీ ప్రశ్న గా కనిపిస్తోంది. సీడీపీఓలు సైతం మౌనంగా ఉంటున్నారు.

Updated Date - 2021-02-01T07:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising