ఆర్బీకే వద్ద ‘వైసీపీ’ దిష్టిబొమ్మ దహనం
ABN, First Publish Date - 2021-07-08T06:25:25+05:30
పప్పుశనగ కొనుగోలు చేసి వంద రోజులైనా రైతు ఖాతాల్లో డబ్బులు జమచేయకపోవడాన్ని నిరసిస్తూ రైతు సంఘం వెన్నపూసపల్లి ఆర్బీకే సెంటర్ వద్ద బుధవారం వైసీపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
వైసీపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రైతులు
యల్లనూరు, జూలై 7 : పప్పుశనగ కొనుగోలు చేసి వంద రోజులైనా రైతు ఖాతాల్లో డబ్బులు జమచేయకపోవడాన్ని నిరసిస్తూ రైతు సంఘం వెన్నపూసపల్లి ఆర్బీకే సెంటర్ వద్ద బుధవారం వైసీపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజారామిరెడ్డి మాట్లాడు తూ.. వర్షాకాలం రావడంతో పొలం పనులు చేసుకోవడానికి డబ్బులు అవసరమని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ఖాతాల్లోకి డబ్బు లు వేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2021-07-08T06:25:25+05:30 IST