ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగల అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-01-21T06:38:37+05:30

చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టుచేసినట్టు అర్బనసీఐ కరుణాకర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరంఅర్బన, జనవరి 20: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టుచేసినట్టు అర్బనసీఐ కరుణాకర్‌ తెలిపారు. స్థానిక అర్బన పోలీ్‌సస్టేషనలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అరెస్టు వివరాలను వెల్లడించారు. ధర్మవరం పట్టణంలోని కేతిరెడ్డికాలనీకి చెందిన నమ్మే రామాంజినేయులు, మదనపల్లికి చెందిన బాలాజీ చోరీలకు పాల్పడుతూ జల్సాలు చేస్తూండేవారు.  వీరిద్దరు తారకరామాపురంలో ఈనెల  6వతేదీ మధ్యాహ్నం సమయంలో ఓ ఇంటి తాళాలను పగలకొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని  రూ. లక్ష విలువ చేసే బంగారు నెక్లెస్‌, రెండు జతల వెండి కాలి గొలుసులు దొంగలించారు. ఈనెక్లె్‌సను కదిరిలోని మణప్పురం ఫైనాన్సలో రూ.65 వేలకు కుదవపెట్టి రసీదు కూడా తీసుకున్నారన్నారు. అదేవిధంగా ఈనెల 12న పట్టణంలోని రాంనగర్‌లో ఇంటికి తాళం వేసిన ఇంటిలో రూ.50వేలు నగదు, ఉంగరం దొంగతనం చేశారన్నారు. అంతేకాక వీరు పలు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఇందిరమ్మకాలనీ సమీపంలోని ప్యాదిండి ఆంజనేయస్వామి గుడి వద్ద బుధవారం వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ ఇద్దరు దొంగలు పట్టుబడినట్లు తెలిపారు. వీరిలో రామాంజినేయులు నుంచి రూ.1.25 లక్షలు, బాలాజీ నుంచి రూ.75వేల నగదు  స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టుచేసి రిమాండ్‌కు పంపినట్టు సీఐ తెలిపారు. దీంతో డీఎస్పీ రమాకాంత, సీఐ కరుణాకర్‌, హెడ్‌కానిస్టేబుల్స్‌ మునేనాయక్‌, శ్రీధర్‌ఫణి, కానిస్టేబుల్స్‌ లక్ష్మీనరసింహులు, మధుసూదన, సుధీర్‌, శీనానాయక్‌, ప్ర తాప్‌, చలపతిని అభినందించారు.

Updated Date - 2021-01-21T06:38:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising